యూట్యూబర్‌ను వెంటాడి మరి చితక్కొట్టిన కరాటే కల్యాణ్.. ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కరాటే కళ్యాణి. సినీ పరిశ్రమలోని ఇబ్బందులతో పాటు సామాజిక సమస్యలపైనా తన గళం వినిపిస్తూ వుంటారు. తాజాగా యూట్యూబ్‌లో ప్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ రెడ్డిపై ఆమె దాడి చేయడం కలకలం రేపుతోంది. గురువారం రాత్రి కరాటే కళ్యాణి మరికొందరితో కలిసి యూసఫ్ గూడ బస్తీలో శ్రీకాంత్ రెడ్డిని వెంటాడి మరీ చితకబాదారు.
కాగా.. శ్రీకాంత్ రెడ్డి అనే యూట్యూబర్ గత కొన్నేళ్లుగా అసభ్యకరమైన వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. అమ్మాయిలు, ఆంటీల దగ్గరకు వెళ్లి వారితో అసభ్యకరంగా మాట్లాడటం, వారిని టచ్ చేయడం వంటి ఫ్రాంక్ వీడియోలు చేస్తూ యూత్‌లో బాగా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే మహిళల్ని కించపరిచేలా ఆ వీడియోలు వుండటంతో శ్రీకాంత్ రెడ్డి ఇంటికి తన అనుచరులతో వెళ్లి మరీ అతన్ని చితకబాదింది కళ్యాణి. దీంతో అతను కూడా తిరగబడ్డాడు. ఈ కొట్లాటలో కళ్యాణి తన బిడ్డతో సహా కిందపడిపోయింది. అయినప్పటికీ తేరుకుని అతనిని కొట్టింది.
అయితే తాను పెయిడ్ ఆర్టిస్ట్‌లకు డబ్బులిచ్చి ప్రాంక్ వీడియోలు తీస్తున్నానని.. ఇది నచ్చకపోతే తనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ కొట్టడం ఏంటని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తనతో వీడియో తీసుకోవడానికి డబ్బులు అడిగిందని.. అవి ఇవ్వకపోవడంతోనే ఇలా చేసిందని అతను ఆరోపిస్తున్నాడు. మరోవైపు కళ్యాణి మాత్రం ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తోంది. శ్రీకాంత్ తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని.. తనతో పడుకోవాలని అడిగాడని, అంతేకాకుండా తన శరీరాన్ని తాకాడని అందుకే చెంప పగులగొట్టానని కరాటే కళ్యాణి చెబుతోంది. ఈ గొడవకు సంబంధించిన మొత్తం ఇష్యూని ఆమె ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. దాడి అనంతరం ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments