Kamalinee Mukherjee : ఆనంద్‌లో అలరించిన అందం..ఇప్పుడిలా, కమిలినీ ఇలా అయిపోయిందేంటీ..?
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్స్ ఫేడవుట్ అయిపోయిన తర్వాత వారిని మళ్లీ చూస్తే గుర్తుపట్టడం చాలా కష్టం వుంటోంది. ఫలానా సినిమాలో నటించి ఈమెనా అంటూ ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన వారు ఇటీవల కొన్ని టీవీ షోలకు, సినిమా ఈవెంట్లకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. స్టేజ్‌పై వారి పేరును యాంకర్ చెప్పగానే షాక్ అవడం ప్రేక్షకుల వంతవుతోంది. తమ అందాలతో గిలిగింతలు పెట్టిన హీరోయిన్స్ గుర్తుపట్టని విధంగా మారిపోతున్నారు.
ఆనంద్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన కమిలినీ :
ఇక అసలు విషయంలోకి వెళితే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఆనంద్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు బెంగాలీ ముద్దుగుమ్మ కమిలినీ ముఖర్జీ (Actress Kamalini Mukherjee). తొలి సినిమాతోనే తన క్యూట్ లుక్స్, అమాయకత్వం, అందం, అభినయంతో తెలుగువారిని ఆకట్టుకుంది. ఆ వెంటనే గోదావరి, హ్యాపీడేస్, స్టైల్, గమ్యం, జల్సా, గోపి గోపిక గోదావరి, నాగవల్లి వంటి సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ నటించింది. తెలుగులో గోవిందుడు అందరివాడేలే, మలయాళంలో పులిమురుగన్‌ల తర్వాత మళ్లీ కమిలినీ కనిపించలేదు.
డల్లాస్‌లో తళుక్కున మెరిసిన కమిలినీ :
ఆమె పెళ్లి చేసుకుందా .. లేక వ్యాపారాల్లో ఏమైనా బిజీగా వుందా అన్న విషయం తెలియరాలేదు. అయితే కొద్దికాలం క్రితం కమిలినీ అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడినట్లుగా తెలుస్తోంది. ఇటీవల డల్లాస్ నగరంలో జరిగిన ఓ ఈవెంట్‌లో కనిపించి షాకిచ్చింది. బొద్దుగా గుర్తు పట్టలేనంతగా ఆమె మారిపోయింది. కమిలీని (Kamalini Mukherjee)చూసిన ప్రేక్షకులు ఈమె గోదావరి సినిమాలో మనం చూసిన రూపానేనా అంటూ పాత ఫోటోలు చూసుకుంటున్నారు. ప్రస్తుతం కమిలినీ ముఖర్జీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com