Kajal Aggarwal: ఒళ్లు చేసిన కాజల్.. లేటెస్ట్ పిక్స్‌తో షాక్‌లో ఫ్యాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
మగవారితో పోలిస్తే ఆడవారి శరీరం విభిన్నం. అలాగే ఫిజికల్‌గా కూడా వారు చాలా సున్నితంగా వుంటారు. అలాగే త్వరగా బరువు కూడా పెరుగుతారు. కొన్నాళ్లు ఫిగర్ మెయింటైన్ చేసినప్పటికీ, పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత మహిళల శరీరంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకే ఆ సమయంలో బాడీని స్లిమ్‌గా వుంచడం మామూలు విషయం కాదు. స్టార్ హీరోయిన్, కలువకళ్ల కాజల్ ఇప్పుడు అదే సమస్యను ఎదుర్కొంటున్నారు.
లక్ష్మీ కళ్యాణంతో తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చిన కాజల్:
2007లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). అయితే కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన చందమామ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. 2009లో వచ్చిన మగధీర ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో.. ఒక్కసారిగా టాప్ హీరోయిన్లలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది కాజల్. ఆ తర్వాత ఆమె నటించిన ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, నా పేరు శివ, బిజినెస్ మెన్, టెంపర్, నేనే రాజు నేనే మంత్రి, ఖైదీ నెంబర్ 150 వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి ఆమెకు స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టాయి.
రెండేళ్ల క్రితం గౌతమ్ కిచ్లూతో పెళ్లి:
తెలుగుతో పాటు దక్షిణాదిలోని అగ్రహీరోలందరితో నటించిన కాజల్.. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని 2020 అక్టోబర్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత సినిమాలకు స్వస్తి చెప్పకుండా.. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే కొన్ని ప్రాజెక్ట్స్‌లో నటించారు కాజల్. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని కాజల్ కొన్ని ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకున్నారు కూడా.
ఈ ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్:
ఈ ఏడాది ఏప్రిల్‌లో కాజల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత తన బిడ్డతో వున్న ఫోటోలను షేర్ చేస్తూ వచ్చిన ఆమె.. అనంతరం హాట్ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చిపోతోంది. అయితే ఇటీవల నీలం రంగు ప్యాంట్, లైట్ గ్రీన్ షర్ట్‌లో కాఫీ తాగుతూ పోస్ట్ చేసిన ఫోటోల్లో కాజల్‌ను చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆమె కాస్త బొద్దుగా కనిపించారు. బిడ్డ పుట్టాక కాజల్ బరువు పెరిగినట్లు అర్ధమవుతోంది. అయితే స్వతహాగా ఫిట్‌నెస్‌పై కేర్ తీసుకునే కాజల్ త్వరలోనే మళ్లీ స్లిమ్ అవుతారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సినిమాలు, వ్యాపారంతో కాజల్ బిజీ:
ప్రస్తుతం కాజల్ (Kajal).. తమిళ దర్శక దిగ్గజం శంకర్ డైరెక్షన్‌లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న భారతీయుడు 2లో నటిస్తున్నారు. ఇటీవల ఆ చిత్ర షూటింగ్‌లోనూ ఆమె జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే తన భర్త కుటుంబానికి చెందిన ఫర్నిచర్ బిజినెస్ వ్యవహారాల్లోనూ కాజల్ పాలుపంచుకుంటున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com