డ్రగ్స్ కేసులో మళ్లీ హీరోయిన్ల విచారణ.. హీరోల వంతూ వచ్చేసింది!
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరోసారి స్టార్ హీరోయిన్లను విచారించేందుకు ఎన్సీబీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్లకు త్వరలో మళ్లీ ఎన్సీబీ పిలుపునివ్వనున్నట్టు సమాచారం. డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్న హీరోయిన్లను ఎన్సీబీ ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేను ఎన్సీబీ విచారించిన విషయం తెలిసిందే. అయితే 2015లో దీపిక డ్రగ్స్ కోసం చాటింగ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అంతేకాకుండా ముగ్గురు హీరోయిన్ల తొలి విచారణలో ఎన్సీబీ సృంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీపిక తన విచారణలో ఎక్కువ భాగం చాలా ఎమోషనల్ అయినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ఆమె తీరుతో ఎన్సీబీ అధికారులు తీవ్ర అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. ఎమోషనల్ డ్రామాను కట్టిబెట్టి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తోంది. అలాగే శ్రద్దా కపూర్, సారా అలీఖాన్‌లను కూడా విచారించిన ఎన్సీబీ అధికారులు వీరి సమాధానాలతో సంతృప్తి చెందలేదని తెలుస్తోంది.
ఇక హీరోల వంతు..
డ్రగ్స్ కేసులో హీరోల వంతు కూడా వచ్చేసింది. రేపో మాపో బాలీవుడ్ ముగ్గురు స్టార్ హీరోలకు ఎన్సీబీ సమన్లు అందజేయనున్నట్టు సమాచారం. డ్రగ్స్ వాడే హీరోల జాబితా ఇప్పటికే సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎన్సీబీ తొలి జాబితాలో టాప్ హీరోలున్నట్టు సమాచారం. కాగా ఈ జాబితాలో ఒకరిద్దరు తెలుగు నటులకు సైతం సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆ టాలీవుడ్ నటులెవరో తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments