Ileana:తల్లి కాబోతున్న ఇలియానా.. పెళ్లికాకుండానే, ఇలా ఎలా, ఆ బిడ్డకు తండ్రి ఎవరు..?
- IndiaGlitz, [Tuesday,April 18 2023]
ఇలియానా.. ఒకప్పుడు టాలీవుడ్లో నెంబర్‌వన్ హీరోయిన్ . కుర్రకారును తన నడుము అందంతో గిలిగింతలు పెట్టి అగ్ర కథానాయకులందరి సరసనా నటించింది. అయితే బాలీవుడ్‌కు వెళ్లి దక్షిణాదిని నిర్లక్ష్యం చేసింది. అక్కడు అనుకున్న స్థాయిలో సినిమాలు హిట్ కాకపోవడంతో రెంటికి చెడ్డ రేవడిలా మారింది ఇలియానా పరిస్ధితి. అయితే ఈ క్రమంలో పలువురితో ఈ గోవా బ్యూటీ ప్రేమాయణం సాగించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలని ఇలియానా భావిస్తోంది.
రెండు ఫోటోలు పోస్ట్ చేసి షాకిచ్చిన ఇలియానా :
ఇదిలావుండగా.. సాధారణంగా సినీ తారల మధ్య ప్రేమ, పెళ్లి, డేటింగ్ వంటి వ్యవహారాలు కామన్. అయితే కొందరు తమ ప్రేమను పండించుకుని పెళ్లి పీటలెక్కితే మరికొందరు మాత్రం బ్రేకప్ చెప్పుకుంటారు. అయితే వీరిలో మరో రకం కూడా వున్నారు. పెళ్లి కాకుండా తారలు తల్లి లేదా తండ్రి కావడం. ఇప్పుడు ఇలియానా విషయంలోనూ అదే జరిగినట్లుగా తెలుస్తోంది. తాను తల్లిని కాబోతున్న విషయాన్ని ఇలియానా స్వయంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో రెండు ఫోటోలు షేర్ చేశారు ఇల్లీ బేబ్. ఒక ఫోటోలో ‘అడ్వెంచర్ మొదలైంది’’ అనే క్యాప్షన్‌తో వున్న టీ షర్ట్‌ను వుంచింది. మరో దానిలో తన మెడలో వేసుకున్న చిన్న గోల్డ్ చైన్‌ను చూపించింది. అందులో ‘మమా’ అరి రాసుంది. అంతేకాదు.. త్వరలో నిన్ను కలవడానికి ఎదురుచూస్తున్నాను.. నా చిట్టి డార్లింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఎవరి ద్వారా ఇలియానా తల్లయ్యింది..?
అంతే ఇది చూసిన సినీ జనాలు, నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. వేల సంఖ్యలో కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. కొందరు శుభాకాంక్షలు చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఈ బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ప్రశ్నించారు. అప్పట్లో ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్‌ను ఇలియానా పెళ్లాడినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ బంధం ఎక్కువకాలం నిలవలేదు. ఆ తర్వాతి నుంచి సింగిల్‌గానే వుంటోంది. మరి ప్రస్తుతం ఆమె ఎవరితో డేటింగ్లో వుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత భర్తను పరిచయం చేయడమో లేదంటే.. సరోగసి ద్వారా ఇలియానా తల్లి అవుతున్నారంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ఊహాగానాలకు చెక్ పడాలంటే ఇలియానానే స్వయంగా స్పందించాల్సి వుంది.