Hema: రేవ్ పార్టీ కేసులో నటి హేమకు షాక్.. విచారణకు రావాలని నోటీసులు..
Send us your feedback to audioarticles@vaarta.com
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ కావడంతో నటి హేమకు నోటీసులు ఇచ్చారు. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. పార్టీలో పట్టుబడిన మొత్తం 103 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. హేమ శాంపిల్స్ రిపోర్టులో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఆమెతో పాటు మరో 86 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరు కావాలని వారందరికీ నోటీసులు ఇచ్చారు.
అయితే రేవ్ పార్టీ కేసులో తాను పాల్గోలేదని హేమ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం పార్టీలో హేమ కూడా పాల్గొందని ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పంపించామని చెప్పారు. కానీ హేమ మాత్రం తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని ఒకరిసారి, ఇంట్లో వంట చేస్తూ మరోసారి వీడియోలను రిలీజ్ చేశారు. తాజాగా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఆమె పార్టీకి వెళ్లినట్లు తేలిపోయింది. దీనిపై మీడియా సంప్రదించగా ఏం చేసుకుంటారో చేసుకోండి.. ఈ విషయంపై తర్వాత మాట్లాడతానని దురుసుగా సమాధానం ఇచ్చారు.
మరోవైపు ఈ ఘటనపై టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి స్పందించింది. కరాటే కళ్యాణికి, హేమాకు మొదటి నుంచి గొడవ ఉన్న విషయం విధితమే. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో ఎదురెదురు నిలబడి ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. ఆ తర్వాత కళ్యాణి పేకాట ఆడుతుందంటూ హేమ సంచలన ఆరోపణలు చేసింది. దీంతో వీరిద్దరి మధ్య వివాదం ముదురుతూ వచ్చింది. తాజాగా రేవ్ పార్టీలో హేమ పట్టుబడటంపై కళ్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
"హేమ లాంటి వారు తీవ్రవాదుల కన్నా ప్రమాదం, నేను అప్పట్లో పేకాట ఆడుతూ దొరికానంటూ హేమ నన్ను బజారుకీడ్చింది. ఇప్పుడు ఈమె రేవ్ పార్టీలో డ్రగ్స్‌తో దొరికింది. ఇది నిజం అని నిర్ధారణ అయ్యాక పోలీసులు ఆమెకు శిక్ష వేస్తారు. మా అసోషియేషన్ తరపున కూడా ఆమె పైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాము" అని వెల్లడించింది. కాగా ఈ పార్టీ నిర్వహించిన వాసు బెట్టింగ్ బుకీగా పోలీసులు గుర్తించారు. విజయవాడకు చెందిన వాసు క్రికెట్ బెట్టింగ్ ద్వారా అనతికాలంలోనే కోట్లకు పడగెత్తాడని వెల్లడించారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments