హంసానందినికి క్యాన్సర్... ‘‘ కాలానికి నేను బాధితురాలిగా వుండను’’ అంటూ ఎమోషనల్ పోస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఐటెం గర్ల్‌గా పలు సినిమాల్లో నటించిన హంసానందిని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే హంసా.. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను, లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంటారు. అయితే కొద్దిరోజులుగా ఆమె ఎలాంటి పోస్ట్‌లు షేర్ చేయలేదు. తాజాగా హంసానందిని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్‌ని షేర్ చేశారు. తాను క్యాన్సర్‌తో పోరాడుతున్నానని చెప్పి అభిమానులకు షాకిచ్చింది. అంతేకాదు.. కీమోథెరపీ కారణంగా జుట్టు మొత్తం కోల్పోయి గుండుతో కనిపించడంతో ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఎమోషనల్ అవుతున్నారు. క్యాన్సర్ సోకిందని తాను భయపడటం లేదని.. మళ్లి ఆరోగ్యంతో తిరిగి వస్తానని హంసా నందిని స్పష్టం చేశారు.
ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఆమె ఇలా రాసుకొచ్చారు. ‘‘కాలం నా జీవితంలో ఎలాంటి ప్రభావాలు చూపినా.. నేను బాధితురాలిగా ఉండాలనుకోవడం లేదు. భయం, ప్రతికూల భావాలతో బ్రతకలేను. ధైర్యంగా ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ముందుకు సాగుతా. 18 ఏళ్ల క్రితం క్యాన్సర్‌తో నా తల్లి మరణించారు. నాటి నుంచి అదే భయంతో బతుకుతున్నా.. నాలుగు నెలల క్రితం రొమ్ములో కణతి ఉన్నట్లుగా అనిపిస్తే వైద్యుల్ని సంప్రదించాను. టెస్టుల తర్వాత నాకు రొమ్ము క్యాన్సర్ గ్రేడ్-3 దశలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సర్జరీ చేసి ఆ కణతిని తొలగించారు. క్యాన్సర్‌ని ఆదిలోనే గుర్తించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అనుకున్నాను.
కానీ, ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. జన్యుపరమైన క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు తాజాగా గుర్తించారు. దీని ప్రకారం రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 70 శాతం లేదంటే గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం 40 శాతం ఉంది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే సర్జరీలు చేయించుకోవడం ఒక్కటే మార్గం. ఇప్పటివరకు 9 సార్లు కిమోథెరపీలు చేయించుకున్నాను. అలాంటివి మరో 7 చేయించుకోవాలి. క్యాన్సర్ మహమ్మారికి నా జీవితాన్ని సమర్పించాలనుకోవడం లేదు. నవ్వుతూ ధైర్యంగా పోరాడాలనుకుంటున్నా... సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ మీ ముందుకువస్తా.. అందరిలో స్పూర్తి నింపడానికే నా కథ చెబుతున్నా అని హంసానందిని పోస్ట్ చేశారు. సో... ఆమె క్షేమంగా మళ్లీ తిరిగి రావాలని.. ప్రేక్షకులను తన నటనతో అలరించాలని మనందరం కోరుకుందాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com