రెమ్యునరేషన్ విషయంలో హీరోయిన్ పెద్ద మనసు
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా సినిమాలు డిజాస్టర్స్ అయినప్పుడు హీరోలు నిర్మాతలకు రెమ్యునరేషన్స్ వెనక్కి ఇచ్చేయడం చేస్తుంటారు. కానీ ఓ హీరోయిన్ తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాత వస్తే వద్దని రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు..సాయిపల్లవి. ఆ సినిమాయే `పడి పడి లేచె మనసు`. గత డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.
నిర్మాతకు నష్టం మిగిల్చిన విషయం తెలుసుకున్న సాయిపల్లవి, తనకు మిగిలి బ్యాలెన్స్ రెమ్యునరేషన్ ఇవ్వడానికి వచ్చిన నిర్మాత చెరుకూరి సుధాకర్ దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఆ మొత్తం దాదాపు నలభై లక్షల రూపాయలట. హీరోయిన్ పెద్ద మనసుకు ఆశ్చర్యపోవడం నిర్మాత వంతైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout