కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ అన్నారు.. కానీ : క్యాస్టింగ్ కౌచ్‌పై ఎస్తర్ వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాల్లో అవకాశాల పేరిట యువతులను లోబరచుకునే ‘‘క్యాస్టింగ్ కౌచ్’’ మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల అగ్ర కథానాయిక అనుష్క సైతం క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవకాశాలు ఆశచూపి అమ్మాయిలను లొంగదీసుకునే విష సంస్కృతి టాలీవుడ్‌లోనూ వుందన్నారు. కెరీర్ బిగినింగ్ లో తాను కూడా చూశానని... అయితే నేను ప్రతి విషయంలో ముక్కుసూటిగా వుంటానని, కరెక్ట్ గా మాట్లాడతాని స్వీటీ చెప్పారు. తన మనస్తత్వం తెలిసి, తన దగ్గరకు ఎవరూ ఇలాంటి ప్రతిపాదనలు తీసుకురాలేదు అని అనుష్క అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాజాగా మరో నటి ఎస్తర్ సైతం క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. 'భీమవరం బుల్లోడు', 'గరం', 'జయ జానకి నాయక' లాంటి తెలుగు సినిమాల్లో నటించిన ఎస్తర్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఈ దారి వర్కవుట్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానైనా సెటిలవ్వాలని భావించింది. కానీ అక్కడా నిరాశ తప్పలేదు. అదే సమయంలో ప్రముఖ సింగర్ నోయెల్‌తో ప్రేమలో పడి... అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ వీరి కాపురం ఎక్కువకాలం సాగలేదు. పెళ్లైన ఏడాదిలోపే వీరు విడాకులు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తర్ తాను ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఆఫర్స్ రావాలంటే కమిట్మెంట్ ఇస్తావా..? అని చాలా మంది అడిగారని.. వాటికి ఒప్పుకోకపోతే కెరీర్ ఇక్కడితోనే ఆగిపోతుందని తనను బెదిరించారని ఎస్తర్ తెలిపింది. కమిట్మెంట్ కోసం నేరుగా అడగకపోయినా.. మాటలు అలాగే వుండేవని ఆమె తెలిపారు. అవకాశాల కోసం దిగజారే అవసరం తనకు లేదని .. అందుకే 'నో' చెప్పానని పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com