Divyavani : టీడీపీకి దివ్యవాణి రాజీనామా.. పార్టీలో దుష్టశక్తులంటూ ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుదేశం పార్టీకి సినీనటి దివ్యవాణి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె వెల్లడించారు. తన రాజీనామాకు గల కారణాలను కూడా ఆమె ఈ సందర్భంగా వివరించారు. తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు దివ్యవాణి ధన్యవాదాలు తెలిపారు.
మహానాడులో అవమానం జరిగింది:
కొద్దిరోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యవాణి పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. మహానాడులో రెండో రోజు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆమె అవమానంగా భావించినట్లుగా ప్రచారం జరుగుతోంది. మహానాడు ముగిసిన తర్వాత ఆమె మాట్లాడిన ఓ వీడియో క్లిప్ వైరల్ అయింది. అందులో మహానాడులో తనకు అవమానం జరిగిందని... తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా వచ్చానని వాపోయారు. టీడీపీకి తాను నిస్వార్థంగా పని చేస్తున్నానని... అయినా పార్టీలో తనకు గుర్తింపే లేదని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశవారు. ఒక కళాకారుడు పెట్టిన పార్టీలో తనలాంటి కళాకారులకు సరైన స్థానం లేకపోవడం బాధను కలిగిస్తోందని వాపోయారు.
జగన్‌తో విభేదాలు లేవు:
పార్టీలో తాను ఇన్ని రోజులు ఎలాంటి అధికారం లేని అధికార ప్రతినిధిగా ఉన్నానని దివ్యవాణి స్పష్టం చేశారు. సీఎం జగన్ పై కానీ, మాజీ మంత్రి కొడాలి నానితో కానీ తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. ఒక తప్పుడు ట్వీట్ వల్లే రాజీనామా చేసినట్లు దివ్యవాణి పేర్కొన్నారు.
వైసీపీకి ధీటుగా కౌంటర్:
తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న దివ్యవాణి టీడీపీ తరపున తన స్వరాన్ని వినిపిస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదలుకొని, కొడాలి నాని, రోజా వంటి వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్‌లు ఇచ్చేవారు. పార్టీ కార్యక్రమాలలోనూ ఆమె చురుకుగా పాల్గొనేవారు. మహానాడుకు ముందు నిర్వహించిన మినీ మహానాడులలోనూ దివ్యవాణి ఉత్సాహంగా పాల్గొన్నారు. కీలక నేతగా మారుతున్న ఈ సమయంలో ఆమ రాజీనామా పార్టీ నేతలను, కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout