సీత' పాత్ర కోసం రూ.12 కోట్లు డిమాండ్ చేస్తున్న నటి!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై పురాణగాధల తాకిడి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రభాస్ రామాయణం నేపథ్యంలో 'ఆదిపురుష్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. బాలీవుడ్ లో రామాయణం నేపథ్యంలో మరో చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది.
అలౌకిక్ దేశాయ్ దర్శత్వంలో 'సీత' అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. సీత దేవి కోణం నుంచి అలౌకిక్ దేశాయ్ రామాయణం కథని చెప్పేందుకు రెడీ అవుతున్నారు.ఈ చిత్రం కోసం ముందు నుంచి స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నే అనుకుంటున్నారు.
తాజాగా దర్శక నిర్మాతలకు కరీనా ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె సీత పాత్రలో నటించే ఈ చిత్రం కోసం ఏకంగా రూ.12 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. కరీనా డిమాండ్ చూసి నిర్మాతలు నివ్వెరపోయినట్లు టాక్. అయితే కరీనా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడానికి కారణం ఉంది.
ఈ చిత్రం కోసం కరీనా కనీసం ఏడాది పాటు వర్కౌట్, ప్రేపరేషన్స్ చేయాల్సి ఉంటుందట. అందుకే ఆమె 12 కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్. సాధారణంగా కరీనా 6 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. మరి నిర్మాతలు ఆమెకు 12 కోట్లు ఇచ్చేందుకు రెడీ అవుతారా లేక ప్రత్యామ్నాయాలు చూసుకుంటారా అనేది వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com