గిఫ్ట్‌పై ఆశతో రూ.85000లను పొగొట్టుకున్న హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండండి మొర్రో అని పోలీసులు మొత్తుకుంటున్న ప్రజలకు ఏమాత్రం పట్టదు. ఏదో ఒక మోసానికి బలైపోతున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోరు కానీ.. నష్టపోయిన తర్వాత మాత్రం తలలు పట్టుకుంటున్నారు. ఈ కోవలో సెలబ్రిటీలు కూడా ఉండటం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తుంది. వివరాల్లోకెళ్తే.. హీరోయిన్ సోనాక్షి వర్మ ఓ నైజీరియన్ చేతిలో ఇలాగే మోసపోయారు.
కొన్ని నెలల క్రితం మెర్రిన్ కిర్రాక్ అనే నైజీరియన్ సోనాక్షి వర్మకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. ఆమె కూడా ఓకే చేసింది. ఇద్దరూ చాట్ కూడా చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం తమ స్నేహానికి గుర్తుగా ఓ బహుమతిని పంపుతున్నానంటూ మెర్రిన్ కిరాక్ ఫోన్ చేసి సోనాక్షికి చెప్పాడు. రెండు, మూడు రోజులకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారి ఫోన్ చేస్తున్నాంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మెర్రిక్ నుండి ఓ గిఫ్ట్ వచ్చిందని రూ. 85వేలు చెల్లిస్తేనే గిఫ్ట్ పంపుతామని అన్నారు. నిజంగానే తనకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుండి ఫోన్ వచ్చిందని భావించిన సోనాక్షి వర్మ ఆయన చెప్పిన అకౌంట్‌లోకి రూ.85వేలు ట్రాన్స్‌ఫర్ చేసింది.
వారం రోజులు తర్వాత కూడా గిఫ్ట్ రాకపోవడంతో ఆమె తనకు ఫోన్ చేసిన అధికారిని సంప్రదించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ఫోన్ సిచ్ఛాఫ్ చేసి ఉండటంతో తాను మోసపోయాననే సంగతి అర్ధమైంది. దాంతో ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com