ఆ తప్పు జీవితంలో చెయ్యను: చార్మి
Send us your feedback to audioarticles@vaarta.com
పంజాబీ ముద్దు గుమ్మ చార్మీ కౌర్ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్స్ చేసుకుంటున్నట్టు ఇటీవల మీడియాలో వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే.. చార్మి మాత్రం తనకు పెళ్లి మీద ఎలాంటి ఆసక్తి లేదంటూ ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తోంది. అయినా కూడా రూమర్స్‌కి మాత్రం చెక్ పడటం లేదు. ప్రేక్షకుల ఆసక్తికి అనుగుణంగా ముద్దుగుమ్మల పెళ్లి వార్తలను వాళ్లతో సంబంధం లేకుండానే సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తూ వస్తున్నారు. దీనికి మీడియా కూడా తోడవడంతో ఇవెప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.
తాజాగా తన పెళ్లి వార్తలపై చార్మి మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తను ఇప్పుడు తన కెరీర్ పరంగా ది బెస్ట్ ఫేజ్‌లో ఉన్నానని వెల్లడించింది. అంతేకాదు తను చాలా సంతోషంగా ఉన్నానని.. పెళ్లి చేసుకోవడం వంటి తప్పును చేయబోనని చార్మి కుండబద్దలు కొట్టేసింది. ‘‘ప్రస్తుతం నేను నా కెరీర్ పరంగా బెస్ట్ ఫేజ్‌లో ఉన్నాను. నా జీవితాన్ని నేను చాలా సంతోషంగా గడుపుతున్నాను. జీవితంలో పెళ్లి చేసుకోవడం వంటి తప్పును ఎప్పటికీ చేయబోను’’ అని చార్మి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
పూరి జగన్నాథ్‌తో కలిసి చార్మి ఆయన రూపొందించే చిత్రాలకు కీలక బాధ్యతలు తీసుకుంటూ వస్తోంది. నిర్మాణంలో కూడా భాగమవుతోంది. పూరి డైరెక్ట్ చేసి నిర్మాతగా తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి చార్మి సహ నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా సక్సెస్‌తో అమ్మడి కెరీర్ ఒక గాడిన పడింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న లైగర్ చిత్రానికి కూడా చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే చార్మికి బాగా కలిసొస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com