సినీ ఎంట్రీ ఇచ్చేస్తున్న హీరోయిన్ తమ్ముడు...
- IndiaGlitz, [Thursday,June 16 2016]
హీరోయిన్ అమలాపాల్ తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించి డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం నచ్చిన సినిమాలను మాత్రమే చేసుకుంటూ పోతుంది. అమలాపాల్, ఆమె భర్త సినిమా రంగంలో ఉండటంతో ఇప్పుడు ఆమె తమ్ముడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఎ.ఎల్.విజయ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న చిత్రం అభినేత్రి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రంలో అమలాపాల్ తమ్ముడు అభిషేక్ పాల్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ నటిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.