శృంగార వీడియో వైరల్.. పోలీసులని ఆశ్రయించిన నటి
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొన్ని రోజులుగా సామజిక మాధ్యమాల్లో ఓ అశ్లీల వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఉన్నది మలయాళీ నటి రమ్య సురేష్ అంటూ కూడా కామెంట్స్ వినిపించాయి. దీనితో మానసిక వేదనకు గురైన ఆమె తాజాగా పోలీసులని ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీస్ లని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: బ్యాగ్రౌండ్ లేకపోతే అంతేనా.. ప్రమాదంలో యువ హీరో కెరీర్ ?
ఈ సందర్భంగా రమ్య సురేష్ మాట్లాడుతూ: ఆ వీడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అసలు ఆ వీడియోలో ఉన్నది తాను కాదని అన్నారు. ఆ వీడియో చూడగానే మానసికంగా కుంగిపోయానని అన్నారు. అందుకు కారణం ఆ వీడియోలో ఉన్న నటికి తనకు కొంచెం పోలికలు ఉన్నాయి.
ఆ వీడియోలో ఉన్నది తాను కాదని నా సన్నిహితులు ఖచ్చితంగా చెప్పగలరు. కానీ ఇతరులు గుర్తించలేరు.. అదే తన భయం అని రమ్య సురేష్ అన్నారు. అందుకే పోలీసులని ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు.
ఆ వీడియో ఇంటర్నెట్ లో స్ప్రెడ్ అయ్యాక నాకు చాలా మంది నుంచి అసభ్యకరమైన మెసేజ్ లు వచ్చాయి. అందుకే నా భర్త మద్దతుతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రమ్య అన్నారు. ఫేస్ బుక్ లో కూడా మెసేజ్ లు వస్తున్నాయి. ఆ వీడియో గురించి నాకు ఎలాంటి కాల్స్, మెసేజ్ లు చేయవద్దని తన ఫ్రెండ్స్ కి కూడా చెప్పిందట. ఎలాంటి కాంప్రమైజ్ లకు లొంగకుండా తాను ఈ స్థాయికి వచ్చానని రమ్య అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com