Anasuya:'ఏం చేస్తాం.. పైత్యం' .. రౌడీ హీరోని మళ్లీ టార్గెట్ చేసిన అనసూయ, ఫ్యాన్స్ ట్రోలింగ్.. కౌంటరిచ్చిన రంగమ్మత్త
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాలు, ఈవెంట్స్, టీవీ షోలు, ఓపెనింగ్స్‌తో స్టార్ యాంకర్ అనసూయ బిజీగా వుంటారు. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుండే అనసూయకు భారీగా అభిమానులు వున్నారు. తన కెరీర్‌కు సంబంధించిన విశేషాలు, కొత్త సినిమా సంగతులు, వ్యక్తిగత వివరాలను ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వుంటారు. ఇదే సమయంలో ఆమె అనవసర వివాదాల్లో తలదూరుస్తూ వుంటారు. మొన్నామధ్య తనను ఒకరు ‘‘ఆంటీ’’ అన్నందుకు అనసూయ నానారచ్చే చేసింది. దీంతో పాటు తన గురించి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్న వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది.
అర్జున్ రెడ్డి సమయంలో విజయ్ దేవరకొండ vs అనసూయ :
ఇకపోతే.. తొలి నుంచి స్టార్ హీరో విజయ్ దేవరకొండకు, అనసూయకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ ఇచ్చిన స్పీచ్‌పై రంగమ్మత్త గరమైంది. మహిళల మనోభావాలు దెబ్బతినేలా విజయ్ మాట్లాడారంటూ ఏకంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయితే దీనిపై విజయ్ అభిమానులు, నెటిజన్లు భగ్గుమన్నారు. బూతులు , డబుల్ మీనింగ్ డైలాగ్స్ వుండే జబర్దస్త్‌కు యాంకరింగ్ చేస్తూ.. సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ చేసే నీకు మాట్లాడే అర్హత లేదంటూ అనసూయను ఓ రేంజ్‌లో ట్రోల్ చేసేవారు. ఆ తర్వాత వివాదం సద్దుమణగగా.. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘‘లైగర్’’ సినిమా ఫ్లాప్ కావడంతో అనసూయ చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. దీంతో మరోసారి విజయ్ అభిమానులకు అనసూయ టార్గెట్ అయ్యారు. అప్పుడు కూడా ఈ వివాదం కొద్దిరోజులు నడిచిచింది.
విజయ్ పేరుకు ముందు ‘‘THE’’ వున్నందుకు రెచ్చిపోయిన రంగమ్మత్త :
తాజాగా మరోసారి విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేసింది అనసూయ. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ - సమంత నటిస్తోన్న చిత్రం ‘‘ఖుషి’’. ఈ సినిమాలోని తొలి పాటను ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో విజయ్ పేరుకు ముందు ‘‘THE’’ అని వుంటుంది. అది చూసిన అనసూయ రెచ్చిపోయింది. ‘‘ఇప్పుడే ఒకటి చూశాను... ‘‘ది’’నా..? బాబోయ్.. పైత్యం, ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం..’’ అని ట్వీట్ చేసింది. మరి విజయ్ అభిమానులు కామ్‌గా ఊరుకుంటారా అనసూయను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఈ ట్రోలింగ్‌పైనా అనసూయ సెటైరికల్‌గా ట్వీట్ చేసింది. ‘‘భలే రియాక్ట్ అవుతున్నార్రా దొంగ.. వూప్స్.. బంగారు కొండలంట.. ఎక్కడో అక్కడ నేను నిజం అనేది ప్రూవ్ చేస్తాను అన్నందుకు థ్యాంక్స్ రా అబ్బాయిలు’’ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. మరి ఈ వివాదంపై విజయ్ స్పందిస్తారో లేదో చూడాలి.
‘Morning tweeple!! Felt this is the right way to “wake up” many 😊 This! I personally don’t know a lot of my extended fam page admins.. but I am super proud of the influence I create unlike many others’ ! Not worth the comparison at all.. but this is an option too ani cheptunna.. pic.twitter.com/Gimro8EnPW
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 6, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout