ప్రియాంకరెడ్డి హత్యకేసు: నటీనటుల తీవ్ర ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నారు. చెన్నకేశవులు, జోళ్ల శివ, జోళ్ల నవీన్, మహ్మద్ పాషాలను నిందితులుగా పోలీసులు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది. కొందరు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తుండగా.. మరికొందరు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆక్రోశాన్ని వెల్లగక్కుతున్నారు.
పోరాడదామని పిలుపునిచ్చిన అనుష్క..
తాజాగా.. టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. సీనియర్ నటి అనుష్క, కీర్తి సురేష్, పూనం కౌర్, ఆర్ఎక్స్-100 హీరో కార్తికేయతో పాటు పలువురు నటీనటులు స్పందించారు. సమాజంలో మహిళగా పుట్టడమే నేరమా? అని అనుష్క ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే... అవి కూడా సిగ్గుపడతాయని.. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి వెంటనే శిక్ష పడే విధంగా మనందరం కలిసి పోరాడుదామని ఆమె పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలా..!?
ప్రియాంక హత్య వార్త తనను కలచివేసిందని.. రోజురోజుకూ పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది. మహిళలకు ఎంతో సురక్షితమైనదని భావించే హైదరాబాద్ వంటి నగరంలో ఇంత దారుణ ఘటనకు ఎవరిని నిందించాలి? రోజులో ఏ సమయంలోనైనా ఓ అమ్మాయి సురక్షితంగా తిరిగే రోజులు ఇండియాలో ఎప్పుడు వస్తాయి? నిందితులందరికీ కఠిన శిక్ష విధించాల్సిందే అని ఆమె డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై పూనం కౌర్ స్పందిస్తూ.. ప్రియాంక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు సరిగ్గా స్పందించలేదని తెలిసిందని.. వారితో పోలీసులు చులకనగా మాట్లాడినట్టు తెలిసిందని ఒకింత ఆగ్రహానికి లోనైంది. ఇలా అనడానికి పోలీసులకు సిగ్గు లేదా?.. పోలీసుల తీరు అసహ్యంగా ఉందని పూనం కౌర్ తీవ్రస్థాయిలో మండిపడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout