ప్రియాంకరెడ్డి హత్యకేసు: నటీనటుల తీవ్ర ఆగ్రహం

  • IndiaGlitz, [Friday,November 29 2019]

దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నారు. చెన్నకేశవులు, జోళ్ల శివ, జోళ్ల నవీన్‌, మహ్మద్ పాషాలను నిందితులుగా పోలీసులు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది. కొందరు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తుండగా.. మరికొందరు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆక్రోశాన్ని వెల్లగక్కుతున్నారు.

పోరాడదామని పిలుపునిచ్చిన అనుష్క..

తాజాగా.. టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. సీనియర్ నటి అనుష్క, కీర్తి సురేష్, పూనం కౌర్, ఆర్ఎక్స్-100 హీరో కార్తికేయతో పాటు పలువురు నటీనటులు స్పందించారు. సమాజంలో మహిళగా పుట్టడమే నేరమా? అని అనుష్క ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే... అవి కూడా సిగ్గుపడతాయని.. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి వెంటనే శిక్ష పడే విధంగా మనందరం కలిసి పోరాడుదామని ఆమె పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలా..!?

ప్రియాంక హత్య వార్త తనను కలచివేసిందని.. రోజురోజుకూ పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది. మహిళలకు ఎంతో సురక్షితమైనదని భావించే హైదరాబాద్ వంటి నగరంలో ఇంత దారుణ ఘటనకు ఎవరిని నిందించాలి? రోజులో ఏ సమయంలోనైనా ఓ అమ్మాయి సురక్షితంగా తిరిగే రోజులు ఇండియాలో ఎప్పుడు వస్తాయి? నిందితులందరికీ కఠిన శిక్ష విధించాల్సిందే అని ఆమె డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై పూనం కౌర్ స్పందిస్తూ.. ప్రియాంక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు సరిగ్గా స్పందించలేదని తెలిసిందని.. వారితో పోలీసులు చులకనగా మాట్లాడినట్టు తెలిసిందని ఒకింత ఆగ్రహానికి లోనైంది. ఇలా అనడానికి పోలీసులకు సిగ్గు లేదా?.. పోలీసుల తీరు అసహ్యంగా ఉందని పూనం కౌర్ తీవ్రస్థాయిలో మండిపడింది.

More News

ప్రియాంకరెడ్డి హత్యకేసులో కీలక ఆధారాలు దొరికాయ్: సజ్జనార్

తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన ప్రియాంరెడ్డి హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేవలం 24 గంటల్లోనే నిందితులెవరో తెలుసుకుని ఈ కేసు ఛేదించారు.

శానిటరీ వర్కర్‌ జాబ్ కోసం 7వేల మంది గ్రాడ్యుయేట్లు క్యూ...

ప్రస్తుత కాలంలో జాబ్ ఉంటే చాలు.. అది ఏం వర్క్ ఏం అనేది మాత్రం నిరుద్యోగులు చూడట్లేదు.

ప్రియాంక హత్య కేసు: రంగంలోకి దిగిన కేటీఆర్

వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డిని కొందరు మానవమృగాలు అత్యాచారం చేసి ఆపై..

'ఇద్ద‌రి లోకం ఒక‌టే' సెన్సార్ పూర్తి..

యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంట‌గా రూపొందుతోన్నల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో

పచ్చని కాపురంలో ‘వాట్సాప్’ చిచ్చు.. ప్రియుడితో భార్య ఉండగా..!

తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య వివాహేతర సంబంధాలతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.