VK Naresh: ఆస్తి ఇవ్వలేదని నన్ను చంపేందుకు సుపారీ, రఘువీరా రెడ్డితోనూ బెదిరింపులు.. రమ్యపై నరేష్ సంచలన ఆరోపణలు

  • IndiaGlitz, [Friday,January 27 2023]

చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరో నరేశ్, పవిత్రా లోకేష్‌ల వ్యవహారం ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. వీరు పెళ్లి చేసుకుంటారా, లేక సహజీనవంతోనే సరిపెడతారా అంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ ఇద్దరూ కలిసి ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు. అంతేకాదు.. ఈ వీడియోలో పవిత్రకు లిప్ కిస్ పెట్టి లేటు వయసులోనూ తగ్గేది లేదని నిరూపించారు నరేష్. పెళ్లయితే చేసుకుంటామని చెప్పారు కానీ.. అది ఈ ఏడాదిలో ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి తనకు ప్రాణహాని వుందంటూ నరేష్ కోర్టును ఆశ్రయించారు.

బెంగళూరు వ్యక్తికి నన్ను చంపేందుకు సుపారీ :

సుపారీ ఇచ్చి తనను చంపడానికి రమ్య ప్రయత్నిస్తోందని నరేష్ ఆరోపించారు. బెంగళూరుకు చెందిన రోహిత్ శెట్టి అనే వ్యక్తితో తనను అంతం చేయించడానికి ఒప్పందం కుదుర్చుకుందని నరేష్ ఆరోపించారు. ఈమేరకు పలు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. తన ఇంటి పరిసరాల్లో కొందరు అనుమానితులు తిరుగుతున్నారని.. రెక్కీ కోసమే వారు ఇదంతా చేస్తున్నారని చెబుతు వీడియో ఫుటేజ్‌ను కూడా నరేష్ విడుదల చేశారు. గతంలో మాజీ మంత్రి రఘువీరా రెడ్డితోనూ ఫోన్ చేయించి బెదిరించిందని ఆయన ఆరోపించారు. రమ్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానని తనకు విడాకులు ఇప్పించాలని నరేశ్ న్యాయస్థానాన్ని కోరారు.

2010లో రమ్యతో నరేష్ వివాహం:

2010 మార్చి 3న బెంగళూరులో రమ్యతో తనకు వివాహం జరిగిందని, పెళ్లికి తాను ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదని.. అయినప్పటికీ తన తల్లి విజయ నిర్మల ఆమెకు రూ.30 లక్షల విలువైన బంగారం చేయించిందని నరేష్ చెప్పారు. పెళ్లయిన కొద్దినెలల నుంచి ఆమె నుంచి వేధింపులు మొదలయ్యాయని.. దీంతో పాటు బెంగళూరులో తన తల్లితో పాటే వుండాలని రమ్య కండీషన్ పెట్టిందని నరేష్ తెలిపారు. ఇదే సమయంలో 2012లో రమ్యకు తనకు రణ్‌వీర్ జన్మించాడని.. అయితే తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పలు బ్యాంకులు, కొందరు వ్యక్తుల నుంచి రమ్య లక్షల్లో అప్పులు చేసిందని నరేష్ ఆరోపించారు. చివరికి తన కుటుంబ సభ్యుల నుంచి కూడా రూ.50 లక్షలు తీసుకుందని చెప్పాడు.

రమ్యతో ఇక వేగలేను :

తన ఆస్తి కాజేయడానికి ప్రయత్నించిందని.. అప్పు ఇచ్చిన వారు డబ్బు కోసం తనను వేధిస్తున్నారని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో సుపారీ గ్యాంగ్‌తో మాట్లాడుకుని తనను అంతం చేసేందుకు ప్లాన్ చేసిందని నరేష్ ఆరోపించాడు. గతేడాది ఏప్రిల్‌లో కొందరు రికవరీ ఏజెంట్ల పేరుతో తన ఇంట్లోకి చొరబడ్డారని చెప్పాడు. దీనితో పాటు తనకు తెలిసిన పోలీస్ అధికారి ద్వారా ఫోన్ హ్యాకింగ్ చేయడం నేర్చుకుందని.. దీని సాయంతో తన ఫోన్‌ను హ్యాక్ చేసిందని నరేష్ ఆరోపించాడు. ఈ నరకయాతనను తాను అనుభవించలేకపోతున్నానని.. తనకు విడాకులు ఇప్పించాలని నరేష్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు.

More News

Jamuna :సత్యభామ పాత్రకు జీవం పోశారు.. జమునకు చిరు, బాలయ్య, పవన్ సంతాపం

అలనాటి నటి, తెలుగు వారి సత్యభామ జమున కన్నుమూయడంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

Jamuna : టాలీవుడ్‌లో మరో విషాదం.. అలనాటి నటి జమున కన్నుమూత

గతేడాది కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ వంటి దిగ్గజాలను కోల్పోయి శోకసంద్రంలో మునగిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఏడాదిలో మరో షాక్ తగిలింది.

Pawan Kalyan:మళ్లీ ఏపీ విభజన అంటే  నా అంత ఉగ్రవాది ఉండడు.. తోలు తీస్తా : పవన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదే‌లోని వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో

Padma Awards 2023 : సంగీత దర్శకుడు కీరవాణికి పద్మశ్రీ

రిపబ్లిక్ డేను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది.

Balakrishna: బాలయ్య మాటలు తప్పుగా అనిపించలేదు.. విషయాన్ని సాగదీయొద్దు : ఎస్వీఆర్ వారసుల విజ్ఞప్తి

‘‘వీరసింహారెడ్డి’’ సక్సెస్ మీట్‌లో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.