VK Naresh:తుపాకీ లైసెన్స్ ఇవ్వండి.. పోలీసులను ఆశ్రయించిన వీకే నరేష్, ఏం జరుగుతోంది..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల కాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు సీనియర్ నటుడు వీకే నరేష్. పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్షిప్ వ్యవహారం టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను ఈ ఏడాది ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రతి కార్యక్రమంలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. గతంలో సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసే వీరిద్దరూ ఇప్పుడు ఏకంగా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ జంట నటించిన మళ్లీ పెళ్లి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో నరేష్, పవిత్రల నిజ జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే ఈ సినిమాను నరేష్ తనకు అనుకూలంగా తీయించుకున్నారన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ వీరిద్దరూ ఆ మాటలను పట్టించుకోకుండా ముందుకే వెళ్తున్నారు.
పుట్టపర్తి జిల్లా ఎస్పీని కలిసిన నరేష్ :
ఇదిలావుండగా.. వీకే నరేష్ తుపాకీ లైసెన్స్ కావాలంటూ పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది. ఈ మేరకు గురువారం పుట్టపర్తి జిల్లా ఎస్పీ మాధవరెడ్డిని కలిసిన ఆయన తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని నరేష్ ఇంటిపై కొందరు దుండగులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇంటి ముందు పార్క్ చేసి వున్న కారును దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై నరేష్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
బెంగళూరు వ్యక్తికి నన్ను చంపేందుకు సుపారీ :
సుపారీ ఇచ్చి తనను చంపడానికి రమ్య ప్రయత్నిస్తోందని కొద్దిరోజుల క్రితం నరేష్ ఆరోపించారు. బెంగళూరుకు చెందిన రోహిత్ శెట్టి అనే వ్యక్తితో తనను అంతం చేయించడానికి ఒప్పందం కుదుర్చుకుందని నరేష్ ఆరోపించారు. ఈమేరకు పలు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. తన ఇంటి పరిసరాల్లో కొందరు అనుమానితులు తిరుగుతున్నారని.. రెక్కీ కోసమే వారు ఇదంతా చేస్తున్నారని చెబుతు వీడియో ఫుటేజ్‌ను కూడా నరేష్ విడుదల చేశారు. గతంలో మాజీ మంత్రి రఘువీరా రెడ్డితోనూ ఫోన్ చేయించి బెదిరించిందని ఆయన ఆరోపించారు. రమ్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానని తనకు విడాకులు ఇప్పించాలని నరేశ్ న్యాయస్థానాన్ని కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments