VK Naresh:తుపాకీ లైసెన్స్ ఇవ్వండి.. పోలీసులను ఆశ్రయించిన వీకే నరేష్, ఏం జరుగుతోంది..?

  • IndiaGlitz, [Friday,July 07 2023]

ఇటీవల కాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు సీనియర్ నటుడు వీకే నరేష్. పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్‌షిప్ వ్యవహారం టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను ఈ ఏడాది ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రతి కార్యక్రమంలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. గతంలో సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసే వీరిద్దరూ ఇప్పుడు ఏకంగా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ జంట నటించిన మళ్లీ పెళ్లి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో నరేష్, పవిత్రల నిజ జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే ఈ సినిమాను నరేష్ తనకు అనుకూలంగా తీయించుకున్నారన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ వీరిద్దరూ ఆ మాటలను పట్టించుకోకుండా ముందుకే వెళ్తున్నారు.

పుట్టపర్తి జిల్లా ఎస్పీని కలిసిన నరేష్ :

ఇదిలావుండగా.. వీకే నరేష్ తుపాకీ లైసెన్స్ కావాలంటూ పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది. ఈ మేరకు గురువారం పుట్టపర్తి జిల్లా ఎస్పీ మాధవరెడ్డిని కలిసిన ఆయన తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని నరేష్ ఇంటిపై కొందరు దుండగులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇంటి ముందు పార్క్ చేసి వున్న కారును దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై నరేష్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

బెంగళూరు వ్యక్తికి నన్ను చంపేందుకు సుపారీ :

సుపారీ ఇచ్చి తనను చంపడానికి రమ్య ప్రయత్నిస్తోందని కొద్దిరోజుల క్రితం నరేష్ ఆరోపించారు. బెంగళూరుకు చెందిన రోహిత్ శెట్టి అనే వ్యక్తితో తనను అంతం చేయించడానికి ఒప్పందం కుదుర్చుకుందని నరేష్ ఆరోపించారు. ఈమేరకు పలు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. తన ఇంటి పరిసరాల్లో కొందరు అనుమానితులు తిరుగుతున్నారని.. రెక్కీ కోసమే వారు ఇదంతా చేస్తున్నారని చెబుతు వీడియో ఫుటేజ్‌ను కూడా నరేష్ విడుదల చేశారు. గతంలో మాజీ మంత్రి రఘువీరా రెడ్డితోనూ ఫోన్ చేయించి బెదిరించిందని ఆయన ఆరోపించారు. రమ్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానని తనకు విడాకులు ఇప్పించాలని నరేశ్ న్యాయస్థానాన్ని కోరారు.

More News

High Court:తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు : ఏపీకి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణకు జస్టిస్ అలోక్ అరదే

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రానున్నారు. బాంబే హైకోర్ట్ న్యాయమూర్తిగా

Salaar Teaser : పులి, సింహం డేంజరే.. కానీ జురాసిక్ పార్క్‌లో :  ప్రభాస్ విశ్వరూపం చూశారా, ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్సే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘‘సలార్’’. అప్పుడెప్పుడో ఈ మూవీ నుంచి పోస్టర్లు రిలీజ్ చేయడమే తప్పించి..

Pawan Kalyan:విడాకుల రూమర్స్‌కు చెక్ : భర్తతో అన్నా లెజ్‌నేవా పూజలు, ఒక్క ఫోటోతో అందరికి ఇచ్చిపడేసిన పవన్ కల్యాణ్

నాగబాబు కుమార్తె నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో

Kishan Reddy:కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారా , లేదా  .. మౌనం వీడిన కిషన్ రెడ్డి

ఎన్నికలకు సమయం దగ్గరైన వేళ తెలంగాణ బీజేపీలో మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

Jude Anthany Joseph:అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో ‘2018’ డైరెక్టర్ జూడ్ ఆంథని జోసెఫ్ సినిమా

సినీ ప్రేమికులకు ఎప్ప‌టిక‌ప్పుడు భారీ చిత్రాలు, విజువ‌ల్ వండ‌ర్స్ చిత్రాల‌నే కాదు.. వైవిధ్య‌మైన కాన్సెప్ట్ మూవీస్‌ను కూడా అందిస్తోన్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌