నేనేందుకు నిర్మాతనయ్యానంటే.. ఒక్కసారిగా గతంలోకి వెళ్లిన విజయ్ దేవరకొండ

  • IndiaGlitz, [Monday,November 08 2021]

కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారానన్నారు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఆయన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘‘పుష్పక విమానం’’. ఈ సినిమాలో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. దామోదర దర్శకత్వం వహించగా.. గీత్‌ సైని, శాన్వి మేఘన హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 12న పుష్పక విమానం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం విశాఖపట్నంలో ‘పుష్పక విమానం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నిర్మాణ పనులు చూసుకోవడం చాలా కష్టమైన పని అని... ఒక్కోసారి ఇది అవసరమా అనిపిస్తుంటుంది అని అన్నారు.

పుష్పక విమానం విడుదల సమయంలో నేను ఇండియాలో ఉండనని... ‘లైగర్‌’ షూటింగ్‌ కోసం యూఎస్‌ వెళ్తున్నా అని విజయ్ చెప్పారు. అందుచేత తాను నిర్మించిన ఈ సినిమాని మీరే చూసుకోవాలని విజయ్ తన అభిమానులను కోరారు. కెరీర్‌ స్టార్టింగ్‌లో తాను పడిన కష్టాలు మరొకరు పడకూడదనే ఉద్దేశంతో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించానని ఆయన చెప్పారు. అయితే నిర్మాణ పనులు చూసుకోవడం చాలా కష్టంగా ఉందని.. నటుడిగా కథలు ఎంపిక చేసుకోవడం, పాత్రల కోసం శిక్షణ తీసుకోవడం, సినిమాని ప్రచారం చేసుకోవడం.. ఇలా తీరిక లేకుండా ఉంటోందని విజయ్ చెప్పారు. ఇలాంటి పరిస్ధితిలో ఇంకో సినిమాని నిర్మించి, దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడమంటే మాటలు కాదని.. ఒక్కోసారి ఇది మనకు అవసరమా అనిపిస్తుంటుందని విజయ్ వ్యాఖ్యానించారు.

అయితే కాన్ఫిడెన్స్, మీరు నాపై పెట్టిన నమ్మకంతో ముందుకెళ్తానని ఆయన అన్నారు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలకు ముందుకు నేనెవరో మా గల్లీ వారికే తెలియదని తాను పడిన కష్టాల గురించి విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. ఈ జర్నీని అసలు ఊహించలేదని.. తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్ర దర్శకుడు దామోదరతో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని.. తనలో మంచి రచయిత ఉన్నాడని, సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడని విజయ్ ప్రశంసించారు. తమ్ముడు ఆనంద్‌ నటన ప్రతి ఒక్కరికి నచ్చుతుందని... హీరోయిన్లు ఇద్దరూ చాలా చక్కగా చేశారని ఆయన కొనియాడారు. ఇక పుష్పక విమానంతో పాటే నవంబరు 12న విడుదలవుతున్న కార్తికేయ ‘రాజా విక్రమార్క’ చిత్రం కూడా బాగా ఆడాలని విజయ్ ఆకాంక్షించారు.

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: విశ్వ ఎలిమినేట్.. షాక్‌లో హౌస్‌మేట్స్, ఇదేంటీ ఇలా జరిగింది ..?

బిగ్‌బాస్ 5 తెలుగు తొమ్మిదో వారం ఎండింగ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట ఫన్‌గా షోను ప్రారంభించారు నాగ్.

కాబోయే భార్య‌ని ప‌రిచ‌యం చేసిన కార్తికేయ‌.. స్టేజ్‌పైనే మోకాళ్లపై కూర్చొని ప్ర‌పోజ్

ప్రస్తుతం తెలుగు నాట హీరోలు, హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు పెళ్లిపీటలెక్కుతున్నారు.

పుష్ప ది రైజింగ్.. సునీల్ మరీ ఇంత క్రూరంగానా, భయపెడుతున్న మంగళం శ్రీను

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి పార్ట్‌ని ‘‘పుష్ప ది రైజింగ్ ’’

'భీమ్లా నాయ‌క్' నుంచి టైటిట్ సాంగ్ విడుద‌ల‌.. ఫ్యాన్స్‌ని ఊపేస్తున్న ‘లాలా భీమ్లా’

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు, పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

బిగ్‌బాస్ 5 తెలుగు : ముగ్గురు సేఫ్.. ఇంకా డేంజర్‌ జోన్‌లో ఐదుగురు, మరి ఎలిమినేషన్‌ ఎవరో..?

బిగ్‌బాస్ 5 తెలుగు శనివారం సరదాగా సాగింది. ఎప్పటిలాగే వీకెండ్ కావడంతో నాగ్ ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్ తప్పుల్ని ఎత్తిచూపుతూ వారికి క్లాస్ పీకారు.