Tarun:అసలు ఇలాంటి ఎలా పుట్టుకొస్తున్నాయో .. ఏమైనా వుంటే నేనే చెబుతా : పెళ్లి పుకార్లకు చెక్‌పెట్టిన తరుణ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా వున్న హీరో హీరోయిన్లు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. కానీ ఇంకొందరు ముదురు బెండకాయలు మాత్రం ఈ విషయంలో తప్పించుకుని తిరుగుతున్నారు. పెళ్లెప్పుడు అని అడిగితే దానిని దాటవేస్తున్నారు. అందులో ఒకరు తరుణ్. బాలనటుడిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత లవర్‌బాయ్ ఇమేజ్‌తో ఒకప్పుడు తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా స్టార్ డమ్‌ను ఎంజాయ్ చేశారు. కానీ దీనిని నిలబెట్టుకోవడంలో విఫలం కావడం, ఆపై కొత్త హీరోలు రావడంతో తరుణ్ క్రేజ్ పాతాళానికి పడిపోయింది. ఆ తర్వాత ఆయనకు అవకాశాలు రావడం కూడా తగ్గిపోయింది. దీంతో ఈ తరానికి తరుణ్ అంటే ఎవరో కూడా తెలియని పరిస్ధితి నెలకొంది.
నిహారికతో తరుణ్ పెళ్లంటూ మీడియాలో వార్తలు :
40 ప్లస్‌లో వున్న ఈ హీరో నేటికీ అవివాహితుడు. తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన వారికి , కొత్త హీరోలకి పెళ్లిళ్లు అయిపోతున్నా ఈయన మాత్రం ఇంకా బ్యాచిలర్‌గానే ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో తరుణ్ పెళ్లిపై మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా మెగా డాటర్ నిహారికతో తరుణ్‌కు మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం ఆనోటా ఈ నోటా ఆయన దృష్టికి వెళ్లడంతో తరుణ్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ప్రచారం నిజం కాదు అని తేల్చి చెప్పారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతానని క్లారిటీ ఇచ్చారు. తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని తరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్టేట్‌మెంట్‌తోనైనా ఈ ఫేక్ న్యూస్‌కు చెక్ పడుతుందేమో చూడాలి.
విడాకుల కోసం దరఖాస్తు చేసిన నిహారిక :
కాగా.. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు గారాలపట్టి నిహారిక-చైతన్య దంపతులు చట్టబద్ధంగా విడిపోయేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తన భర్త నుంచి తనకు విడాకులు మంజూరు చేయాల్సిందిగా నిహారిక ఇటీవల కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిందూ వివాహ చట్టం కింద తనకు విడాకులు మంజూరు చేయాల్సిందిగా ఆమె తన దరఖాస్తులో కోరారు. దీంతో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి నిహారిక స్వయంగా చెక్ పెట్టినట్లయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments