Tarun:అసలు ఇలాంటి ఎలా పుట్టుకొస్తున్నాయో .. ఏమైనా వుంటే నేనే చెబుతా :  పెళ్లి పుకార్లకు చెక్‌పెట్టిన తరుణ్

  • IndiaGlitz, [Wednesday,August 02 2023]

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా వున్న హీరో హీరోయిన్లు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. కానీ ఇంకొందరు ముదురు బెండకాయలు మాత్రం ఈ విషయంలో తప్పించుకుని తిరుగుతున్నారు. పెళ్లెప్పుడు అని అడిగితే దానిని దాటవేస్తున్నారు. అందులో ఒకరు తరుణ్. బాలనటుడిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత లవర్‌బాయ్ ఇమేజ్‌తో ఒకప్పుడు తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా స్టార్ డమ్‌ను ఎంజాయ్ చేశారు. కానీ దీనిని నిలబెట్టుకోవడంలో విఫలం కావడం, ఆపై కొత్త హీరోలు రావడంతో తరుణ్ క్రేజ్ పాతాళానికి పడిపోయింది. ఆ తర్వాత ఆయనకు అవకాశాలు రావడం కూడా తగ్గిపోయింది. దీంతో ఈ తరానికి తరుణ్ అంటే ఎవరో కూడా తెలియని పరిస్ధితి నెలకొంది.

నిహారికతో తరుణ్ పెళ్లంటూ మీడియాలో వార్తలు :

40 ప్లస్‌లో వున్న ఈ హీరో నేటికీ అవివాహితుడు. తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన వారికి , కొత్త హీరోలకి పెళ్లిళ్లు అయిపోతున్నా ఈయన మాత్రం ఇంకా బ్యాచిలర్‌గానే ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో తరుణ్ పెళ్లిపై మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా మెగా డాటర్ నిహారికతో తరుణ్‌కు మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం ఆనోటా ఈ నోటా ఆయన దృష్టికి వెళ్లడంతో తరుణ్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ప్రచారం నిజం కాదు అని తేల్చి చెప్పారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతానని క్లారిటీ ఇచ్చారు. తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని తరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్టేట్‌మెంట్‌తోనైనా ఈ ఫేక్ న్యూస్‌కు చెక్ పడుతుందేమో చూడాలి.

విడాకుల కోసం దరఖాస్తు చేసిన నిహారిక :

కాగా.. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు గారాలపట్టి నిహారిక-చైతన్య దంపతులు చట్టబద్ధంగా విడిపోయేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తన భర్త నుంచి తనకు విడాకులు మంజూరు చేయాల్సిందిగా నిహారిక ఇటీవల కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిందూ వివాహ చట్టం కింద తనకు విడాకులు మంజూరు చేయాల్సిందిగా ఆమె తన దరఖాస్తులో కోరారు. దీంతో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి నిహారిక స్వయంగా చెక్ పెట్టినట్లయ్యింది.

More News

Jayasudha :బీజేపీలో చేరిన జయసుధ.. ఎన్నికల్లో పోటీ చేసేది సికింద్రాబాదా, ముషీరాబాదా : క్లారిటీ ఇచ్చిన సహజనటి

సీనియర్ నటి జయసుధ బీజేపీలో చేరారు. బుధవారం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో

Minister Ambati Rambabu:తగ్గేదే లేదు 'బ్రో' .. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్న అంబటి.. ఢిల్లీకి పయనం

సముద్రఖని దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సాయిథరమ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ‘బ్రో’.

Pawan Kalyan:తండ్రి లేని పిల్లాడని జగన్‌ని గెలిపించారు , కానీ ఈసారి అక్కడ గెలుపు మనదే: పవన్ కల్యాణ్

2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలిలో ఖచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందని ఆకాంక్షించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.

Pawan Kalyan:తెలుగు ఇండస్ట్రీ తలెత్తుకునేలా .. ఫిల్మ్ ఛాంబర్ పనిచేస్తుందనుకుంటున్నా : పవన్ కళ్యాణ్

ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందించారు.

Ambati Rambabu:పవన్‌పై బయోపిక్ తీస్తున్నా.. టైటిల్స్ ఇవే , కెలికితే ఇంతే.. సినీ ప్రముఖులూ జాగ్రత్త : అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయిథరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో