హీరో సూర్యపై విమర్శల దాడి.. సీపీఎం, డివైఎఫ్ఐ మద్దతు!
Send us your feedback to audioarticles@vaarta.com
నీట్ పరీక్షలు, సెన్సార్ చట్ట విధి విధానాలపై కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు స్టార్ హీరో సూర్య. నీట్ పరీక్షల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు అని సూర్య అన్నారు. నీట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు సూర్య మద్దతు తెలిపారు. అలాగే సెన్సార్ చట్టంలో సవరణల వల్ల సినిమారంగం కూడా నష్టపోతోందని సూర్య కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
దీనితో సూర్యపై బిజెపి నేతలు విమర్శల దాడి ప్రారంభించారు. లీగల్ గా కూడా చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగుతున్నారు. సూర్య వైఖరి ఇలాగే కొనసాగితే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తమిళనాడు యూత్ బిజెపి వింగ్ బహిరంగ ప్రకటన చేసింది.
బీజీపీ సూర్యపై విమర్శలకు దిగుతుండడంతో సీపీఎం రంగంలోకి దిగింది. సూర్యకు మద్దతుగా నిలిచింది. బిజెపి నేతలు సూర్య పట్ల బెదిరింపు ధోరణితో వ్యవహరించడం హేయమైన చర్య అని సిపిఎం ఎంత కె. బాలకృష్ణన్ అన్నారు.
నీట్ వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులని సూర్య తెలిపారు. దీనికే ఆయనపై బెదిరింపులకు దిగితే భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడ ఉంది అని సిపిఎం నేతలు అన్నారు. సూర్యకు డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ అఫ్ ఇండియా(డివైఎఫ్ఐ) కూడా మద్దతు తెలిపింది. సూర్యపై బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. నీట్ వల్ల 17 రాష్ట్రాల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని డివైఎఫ్ఐ పేర్కొంది.
వివాదాలకు దూరంగా ఉండే సూర్య నీట్ పై వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్నారు. విద్యార్థులకు మద్దతు తెలిపినందుకు ఆయన్ని బిజెపి నేతలు టార్గెట్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సూర్య.. టీజె జ్ఞానవేల్ దర్శత్వంలో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout