'మా అబ్బాయి' గా వస్తున్న నన్ను మీ అబ్బాయిలా ఆదరించండి - హీరో శ్రీ విష్ణు
Send us your feedback to audioarticles@vaarta.com
`ప్రేమ ఇష్క్ కాదల్, ప్రతినిధి, `అప్పట్లో ఒకడుండేవాడు` చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన హీరో శ్రీ విష్ణు కథానాయకుడుగా బేబి సాక్షి సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాష్ రావు నిర్మిస్తోన్న చిత్రం `మా అబ్బాయి`. చిత్రా శుక్లా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే రోజా, శ్రీ విష్ణు, నారా రోహిత్, సుధీర్‌బాబు, నాగశౌర్య, సాయికొర్రపాటి, మల్కాపురం శివకుమార్, విరించి వర్మ, రవికుమార్ నర్రా, ఐజి ఎ.రవీంద్ర, కిషోర్ తిరుమల, జగదీశ్వరరావు, విశాల్ పాట్ని, మార్తాండ్ కె.వెంకటేష్, కాశీవిశ్వనాథ్, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రాఫర్ థమశ్యామ్, నిర్మాత బలగం ప్రకాష్ రావు, దర్శకుడు కుమార్ వట్టి, హీరో ఆనంద్ తదితరులు హాజరయ్యారు.
ఎమ్మెల్యే రోజా, మల్కాపురం శివకుమార్, విరించి వర్మ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. బిగ్ సీడీ, ఆడియో సీడీలను నారా రోహిత్, నాగశౌర్య విడుదల చేశారు. తొలి సీడీని నారా రోహిత్ అందుకున్నారు. ఈ సందర్భంగా .....
ప్రకాష్ పెద్ద నిర్మాతగా ఎదగాలి
మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ - ``ఈ రోజు నా మిత్రుడు ప్రకాష్ సినీ రంగంలోకి వచ్చి మా అబ్బాయి సినిమా చేయడం ఆనందంగా ఉంది. టీజర్, సాంగ్ బావున్నాయి. సినిమా తప్పకుండా పెద్ద హిట్ సాధిస్తుంది. తన తొలి అడుగుతో విజయం సాధించి, విజయాలతో చాలా దూరం ప్రయాణించాలని కోరుకుంటూ యూనిట్‌ను అభినందిస్తున్నాను`` అన్నారు.
ఇండస్ట్రీకి ప్రకాష్ వంటి నిర్మాతలు అవసరం
సుధీర్ బాబు మాట్లాడుతూ - ``శ్రీ విష్ణు తొలి సినిమా `ప్రేమ ఇష్క్ కాదల్` చూసినప్పుడు తన పెర్‌ఫార్మెన్స్ నచ్చింది. అప్పటి నుండి డిఫరెంట్ సినిమాలు చేస్తూ, హీరోగా ఎదుగుతున్నాడు. రీసెంట్‌గా `అప్పట్లో ఒకడుండేవాడు` సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. నిర్మాత ప్రకాష్‌గారు, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్. కథ నచ్చితే ఎక్కడా కాంప్రమైజ్ కాని వ్యక్తి. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
కథను నమ్మి సినిమా చేసే నిర్మాత
ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ - ``మంచి కథను నమ్మి ధైర్యంగా సినిమా చేసిన నిర్మాత ప్రకాష్‌రావుగారికి అభినందనలు. శ్రీ విష్ణు చాలా చక్కగా నటించడంతో పాటు చక్కగా డ్యాన్సులు చేశాడు. హీరోయిన్ చిత్ర చాలా అందంగా ఉంది. డైరెక్టర్ టేకింగ్ బావుంది. ఈ సినిమా హిట్ అయ్యి యూనిట్ అందరూ ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఈ సినిమాతో శ్రీ విష్ణు నెక్ట్స్ రేంజ్ హీరో అవుతాడు
హీరో నారా రోహిత్ మాట్లాడుతూ - ``సోలో సినిమా నుండి నాకు కుమార్ పరిచయం. స్క్రిప్ట్ నాకు తెలుసు. చాలా మంచి స్కిప్ట్. శ్రీ విష్ణు నాకు స్నేహితుడు. మంచి ఆర్టిస్ట్. తను అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంతో మంచి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సురేష్ వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. నిర్మాత కొత్తవాళ్లను నమ్మి సినిమా చేసి, మంచి అవుట్‌పుట్ రావడానికి ముందున్నాడు. ఎంటైర్ టీంకు గుడ్ లక్`` అన్నారు.
సినిమా పెద్ద హిట్ కావాలి
హీరో నాగశౌర్య మాట్లాడుతూ - ``శ్రీ విష్ణు నిజంగానే మా అబ్బాయి..మాలో ఒకడు. మనస్ఫూర్తిగా సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. సినిమా తీసిన నిర్మాత ప్రకాష్‌గారికి, డైరెక్టర్ కుమార్ సహా అందరికీ మంచి పేరుతో పాటు లాభాలు రావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
చాలా కష్టపడ్డాను..ఆశీర్వదించండి
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ - ``కుమార్ కథ చెప్పగానే, పెద్ద కథ..పెద్ద స్టార్స్‌తో చేసే కథ కదా..నాతోనే ఎందుకు అని అడిగాను. కానీ నన్ను ఎలాగో కుమార్ కన్విన్స్ చేసి సినిమా చేశాడు. చిన్నప్పుడు సైనిక స్కూల్‌లాగా కష్టపడ్డాను. డైరెక్టర్ తన అవుట్‌పుట్ కోసం కాంప్రమైజ్ కాలేదు. సురేష్ అద్భుతమైన మ్యూజిక్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొత్తగా అందించాడు. మా అబ్బాయి సినిమాతో తెలుగుకు కొత్త ఫ్లెవర్ మ్యూజిక్ డైరెక్టర్ రావడం ఆనందంగా ఉంది. మా అబ్బాయిగా మీ ముందకు వస్తున్న నన్ను మీ అబ్బాయిగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నిర్మాత ప్రకాష్‌గారికి జీవితాంతం రుణపడి ఉంటాను
దర్శకుడు కుమార్ వట్టి మాట్లాడుతూ - ``ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో మార్తాండ్ కె.వెంకటేష్‌గారి వద్ద వర్క్ చేశాను. ఆయన దగ్గర వర్క్ చేయడం వల్ల సినిమా ఎలా చేయాలో నేర్చుకున్నాను. అందుకు ఆయనకు థాంక్స్. కథ విని నచ్చి సినిమా చేసిన నిర్మాత బలగం ప్రకాష్‌రావుగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. థమశ్యామ్ చాలా మంచి సినిమాటోగ్రఫీ అందించాడు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు. చిత్ర చాలా చక్కగా నటించింది. సోలో సినిమాలో ఒక్క డైలాగ్‌లో నటించిన శ్రీవిష్ణును చూసి మీరు పెద్ద హీరో అవుతారని చెప్పాను. అప్పటి నుండి నాకు పరిచయం ఏర్పడింది. తను ఈ పాత్రలో ఎంత బాగా చేశాడంటే ఈ పాత్రకు తను తప్ప వేరేవరూ సూట్ కాలేరనేలా చేశాడు. నాకు మంచి టీం కుదిరింది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
మంచి సినిమా...మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి
నిర్మాత బలగం ప్రకాష్ రావు మాట్లాడుతూ - ``ఏదో తెలియని ఉత్సాహం, సంతోషం, ఉద్వేగంగా ఉంది. ఎక్కడో శ్రీకాకుళంలో మారుమూల పుట్టిన నేను ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో సినిమా చేయడంతో ఏదో సాధించానని అనుకుంటున్నాను. దర్శకుడు కథ చెప్పగానే సినిమా చేయగలుగుతాడా అనిపించింది. కానీ వట్టి కుమార్ తాను గట్టి కుమార్ అని నిరూపించుకున్నాడు. హీరో శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడు. తను భవిష్యత్‌లో పెద్ద హీరోగా ఎదిగాడు. అలాగే చిత్రా శుక్లా నటనే కాదు, చక్కగా డ్యాన్స్ కూడా చేశాడు. థమశ్యామ్ మంచి విజువల్స్ ఇచ్చాడు. మంచి సినిమా చేశామని నమ్ముతున్నాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్‌గా మారడానికి కారణం వారే....
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ - ``నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు కుమార్‌గారు, నిర్మాత ప్రకాష్‌గారికి థాంక్స్. అప్పట్లో ఒకడుండేవాడు సినిమా సమయంలో నాకు రీ రికార్డింగ్ చేసే అవకాశం ఇచ్చిన శ్రీ విష్ణుగారికి థాంక్స్. ఆయన సపోర్ట్‌తో పాటు, వేణు అన్న కారణంగానే ఈ సినిమాకు మ్యూజిక్ చేయగలిగాను. దర్శకుడు కుమార్‌గారు స్టయిల్ చూస్తుంటే తొలి సినిమా డైరెక్టర్‌లా అనిపించలేదు. వినాయక్ లాంటి సీనియర్ డైరెక్టర్ చేసినట్లు అనిపిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూసి అందరూ ఎంకరేజ్ చేయండి`` అన్నారు.
రవికుమార్ నర్రా మాట్లాడుతూ - ``మా అబ్బాయి సినిమా యూనిట్ చాలా కష్టపడి సినిమాను రిచ్‌గా తెరకెక్కించినట్టు కనపడుతుంది. నిర్మాత బలగం ప్రకాష్ రావుగారు ఈ సినిమా సక్సెస్‌తో పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఎ.రవీంద్ర మాట్లాడుతూ - ``నిర్మాత బలగం ప్రకాష్‌రావుగారు భవిష్యత్‌లో ఇంకా ఎన్నో సినిమాలను నిర్మించే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీంకు అభినందనలు`` అన్నారు.
కిషోర్ తిరుమల మాట్లాడుతూ - ``శ్రీ విష్ణు నాకు మంచి మిత్రుడు. దర్శకుడు కుమార్, నిర్మాత ప్రకాష్‌గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్‌గారు సహా అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ``నిర్మాత ప్రకాష్‌గారు నాకు సినిమాలో కొన్ని సీన్స్‌ను చూపించారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. తెరపై శ్రీవిష్ణు హీరో అయితే తెర వెనుక ప్రకాష్‌రావుగారే హీరో. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
విరించి వర్మ మాట్లాడుతూ - ``దర్శకుడు కుమార్‌గారికి, నిర్మాత ప్రకాష్‌గారికి, శ్రీవిష్ణు, హీరోయిన్ చిత్ర శుక్లా సహా అందరికీ ఈ సినిమా సక్సెస్ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
శ్రీ విష్ణు, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః థమశ్యామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః వండాన రామకృష్ణ, సంగీతంః సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ః మార్తాండ్.కె.వెంకటేష్, ఫైట్స్ రాబిన్ సుబ్బు నబ, కొరియోగ్రాఫర్స్ః రఘు, అజయ్, సాయి, స్వర్ణ, పాటలుః కందికొండ, కరుణాకర్ అడిగర్ల, సురేష్ బనిశెట్టి, నిర్మాతః బలగ ప్రకాష్ రావు,కథ,స్ర్కీన్ ప్లే,మాటలు,దర్శకత్వంః కుమార్ వట్టి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments