నటుడు శరత్ కుమార్ కు జరిమానా...

  • IndiaGlitz, [Tuesday,July 18 2017]

సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్‌కుమార్‌కు మ‌ద్రాసు హైకోర్టు రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు జ‌రిమానా విధించింది. వివరాల్లోకెళ్తే..2014లో శ‌ర‌త్‌కుమార్‌, రాధికా శ‌ర‌త్‌కుమార్ భాగ‌స్వామ్యంలో మ్యాజిక్ ఫ్రేమ్స్ సంస్థ‌లో 'ఇదు ఎన్న మాయం' సినిమాను రూపొందించారు. ఈ సినిమా నిర్మాణానికిగానూ రాడియ‌న్ అనే సంస్థ‌ను శ‌ర‌త్‌కుమార్ అండ్ పార్ట‌న‌ర్స్ సంప్ర‌దించి కోటిన్న‌ర రూపాయ‌లు అప్పుగా తీసుకున్నారు.
2015 మార్చిలోపు అప్పు చెల్లించ‌కుంటే, టీవీ హ‌క్కులు, త‌ర్వాత నిర్మించ బోయే సినిమా హ‌క్కులు రాడియ‌న్ సంస్థ‌కు అప్ప‌గిస్తున్న‌ట్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ఒప్పందాన్ని అతిక్ర‌మించి సినిమాను విడుద‌ల చేశార‌ని, త‌న‌ఖా పెట్టిన ఆస్థుల‌ను అమ్మ చూశార‌ని రాడియ‌న్ సంస్థ కోర్టులో కేసు వేసింది. విచార‌ణ చేపట్టిన కోర్టు శ‌ర‌త్‌కుమార్‌కు రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు జ‌రిమానా విధించింది. తమపై దాఖలైన వ్యాజ్యాన్ని తోసిపుచ్చాలంటూ శరత్‌కుమార్‌ తరఫున దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారణకు అనుమతించలేదు.

More News

రీమేక్ లో సన్నిలియోన్...

2005లో శేఖర్ సూరి దర్శకత్వంలో వచ్చిన `ఎ ఫిల్మ్ బై అరవింద్` సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. రాజీవ్ కనకాల, షెర్లిన్ చోప్రా, రిషి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం సెన్నేషనల్ హిట్ అయ్యింది.

ప్రభాస్ సరికొత్త లుక్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ రేంజ్ ఇమేజ్ ఉన్న హీరో.

'ఫిదా' వరుణ్ కెరీర్ లోబెస్ట్ మూవీ - దిల్ రాజు

వరుణ్ తేజ్ కథానాయకుడిగా హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు నిర్మించిన చిత్రం `ఫిదా`. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

నాలుగోసారి...

మణిరత్నం,మాధవన్ కాంబినేషన్ లో నాలుగో చిత్రం రాబోతుందని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి.

విజయవాడలో ఘనంగా జరిగిన 'నిన్నుకోరి' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్, కోన ఫిలిం కార్పొరేషన్ పతాకాలపై శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నిన్నుకోరి'.