నటుడు శరత్ కుమార్ కు జరిమానా...
Tuesday, July 18, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటుడు శరత్‌కుమార్‌కు మద్రాసు హైకోర్టు రెండు లక్షల రూపాయలు జరిమానా విధించింది. వివరాల్లోకెళ్తే..2014లో శరత్‌కుమార్, రాధికా శరత్‌కుమార్ భాగస్వామ్యంలో మ్యాజిక్ ఫ్రేమ్స్ సంస్థలో `ఇదు ఎన్న మాయం` సినిమాను రూపొందించారు. ఈ సినిమా నిర్మాణానికిగానూ రాడియన్ అనే సంస్థను శరత్‌కుమార్ అండ్ పార్టనర్స్ సంప్రదించి కోటిన్నర రూపాయలు అప్పుగా తీసుకున్నారు.
2015 మార్చిలోపు అప్పు చెల్లించకుంటే, టీవీ హక్కులు, తర్వాత నిర్మించ బోయే సినిమా హక్కులు రాడియన్ సంస్థకు అప్పగిస్తున్నట్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ఒప్పందాన్ని అతిక్రమించి సినిమాను విడుదల చేశారని, తనఖా పెట్టిన ఆస్థులను అమ్మ చూశారని రాడియన్ సంస్థ కోర్టులో కేసు వేసింది. విచారణ చేపట్టిన కోర్టు శరత్‌కుమార్‌కు రెండు లక్షల రూపాయలు జరిమానా విధించింది. తమపై దాఖలైన వ్యాజ్యాన్ని తోసిపుచ్చాలంటూ శరత్‌కుమార్ తరఫున దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారణకు అనుమతించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments