ఇంటివాడు కాబోతోన్న రాహుల్ రామకృష్ణ.. అర్జున్ రెడ్డి స్టైల్లో కాబోయే భార్యకు ముద్దు, ఫోటో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా వున్న నటీనటులు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్లో చాలా మంది తారలు ఇష్టమైన వ్యక్తులను మనువాడారు. బాలీవుడ్ టూ టాలీవుడ్ ఇదే తంతు. తాజాగా 2022లోనూ అలియా భట్- రణ్‌బీర్ కపూర్లు పెళ్లి చేసుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే .. టాలీవుడ్లో నటుడు, కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
2014లో సైన్మా అనే షార్ట్ ఫిలింతో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. తర్వాత సినిమాల్లోనూ సత్తా చాటారు. 2017లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన అర్జున్ రెడ్డితో రాహుల్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత భరత్ అనే నేను, గీతా గోవిందం, జాతిరత్నాలు, ఆర్ఆర్ఆర్ వంటి వరుస హిట్లతో తెలుగులో బిజీ యాక్టర్‌గా మారిపోయారు. ఈ నేపథ్యంలో తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు రాహుల్. అయితే అందరిలా కాకుండా డిఫరెంట్‌గా ఈ విషయం తెలియజేశారు.
తనకు కాబోయే భార్యకు ముద్దుపెట్టే ఫొటోను పోస్ట్ చేస్తూ.. తన నిర్ణయాన్ని రాహుల్ ప్రకటించాడు. అయితే, ఆ ఫొటోను చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా లిప్ లాక్ ఫొటో కాకుండా వేరే ఫొటో పెట్టి ఉంటే బాగుండేది... మీ కుటుంబానికి గౌరవం ఇవ్వలేదు’’ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే.. సినిమాల విషయానికి వస్తే రాహుల్ రామకృష్ణ నటించిన 'కృష్ణ వ్రింద విహారి', 'విరాటపర్వం' సినిమాలు ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments