Prudhvi Raj:ఉగాది నాడు జనసేనలోకి 30 ఇయర్స్ పృథ్వీ.. పవన్ సమక్షంలో చేరిక,‘‘ఎమ్మెల్యే ’’గా బరిలోకి
Send us your feedback to audioarticles@vaarta.com
థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అంటూ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం సినిమాలో చెప్పిన ఒకే ఒక్క డైలాగ్‌తో టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేశాడు పృథ్వీరాజ్. ‘‘థర్టీ ఇయర్స్’’ అన్న ఆ డైలాగ్‌నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి తన మార్క్ పంచ్‌లతో ప్రేక్షకులకు కితకితలు పెడుతున్నాడు. ఏ సినిమా వచ్చినా అందులో పృథ్వీ ఉండాల్సిందే. ఇక బాలయ్య గెటప్‌లో పృథ్వీ చేసిన పారడీ కామెడీ కడుపుబ్బా నవ్వించింది. మొన్నా మధ్యలో హీరోగా మీలో ఎవరు కోటీశ్వరుడు చేశాడు.. ఇదే సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వైఎస్ జగన్‌తో కలిసి పాదయాత్ర నిర్వహించిన ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చాక కీలకమైన ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని అందుకున్నారు.
లైంగిక వేధింపుల కేసుతో పదవి కోల్పోయి:
అంతా సాఫీగా సాగుతున్న దశలో పృథ్వీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేసి అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. కావాలని తనను ఈ వివాదంలో ఇరికించారని, అంతేకాకుండా సినిమాల్లో అవకాశాలు కూడా రావడం లేదని పృథ్వీ వాపోయారు. ముక్కుసూటిగా వుండే తనకు రాజకీయాలు సరిపడవంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉగాది నాడు జనసేనలోకి :
అయితే ఎందుకోగానీ మళ్లీ రాజకీయాల వైపు మనసు మళ్లడంతో పృథ్వీ జనసేనలోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికు ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు. మొన్నామధ్య మెగా బ్రదర్ నాగబాబును కూడా కలిశారు. తాజాగా జనసేనలో చేరే విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు పృథ్వీ రాజ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగాది నాడు జనసేనలో చేరనున్నట్లుగా తెలిపారు. తాను దర్శకత్వం వహించిన ‘‘కొత్త రంగుల ప్రపంచం’’ అనే చిత్రం త్వరలో విడుదల కానుందని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఉగాది నుంచి జనసేనలో చేరి కార్యకర్తగా పనిచేస్తానని .. పవన్ కల్యాణ్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా వున్నట్లు ఆయన వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments