ప్రభాస్ మెమొరబుల్ పోస్ట్.. ఇండియన్ సినిమా సరికొత్త అధ్యాయానికి 6 ఏళ్ళు!
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి.. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు ఎన్నో అనుమానాలు, సవాళ్లు. ఒక ప్రాంతీయ భాషా చిత్రం ఇంత బడ్జెట్ లో తెరకెక్కించడం రిస్క్ కదా అని పెదవి విరిచినవారు లేకపోలేదు. దానికి తోడు మన చిత్రాలకు నార్త్ లో ఆదరణ అప్పట్లో నామమాత్రమే. ఎంత అద్భుతంగా తెరకెక్కించిన బడ్జెట్ తిరిగి వెనక్కి రావాలి కదా అని కామెంట్ చేసిన వారు లేకపోలేదు.
కానీ అక్కడ ఉన్నది ఉక్కు సంకల్పం కలిగిన జక్కన్న.. ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్.. ధైర్యంగా అడుగు ముందుకు వేసే నిర్మాతలు.. వీరందరి సంకల్పంతో బాహుబలి తొలి భాగం దిగ్విజయంగా అన్ని భాషల్లో ప్రదర్శించబడింది. అప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన టాలీవుడ్ సినిమా రెవెన్యూ గతిని ఒక్కసారిగా మార్చేసింది.
యావత్ ప్రపంచం తెలుగు సినిమా వైపు చూసేలా చేసింది బాహుబలి మొదటి భాగం. బాహుబలి మొదటి భాగం విడుదలై నేటికి సరిగ్గా ఆరేళ్ళు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ప్రభాస్ సోషల్ మీడియాలో మెమొరబుల్ పోస్ట్ పెట్టాడు. '6 ఇయర్స్ ఆఫ్ బాహుబలి. మా టీం దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా క్రియేట్ చేసిన సినిమాటిక్ మ్యాజిక్ ఈ చిత్రం' అని ప్రభాస్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు.
శివలింగాన్ని పైకెత్తుతున్న గూస్బంప్స్ పిక్ ని పోస్ట్ చేశాడు. జక్కన్న చెక్కిన ఈ విజువల్ వండర్ తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. బాహుబలి తర్వాత నుంచే తెలుగులో పాన్ ఇండియా చిత్రాలకు క్రేజ్ పెరిగింది. ధర్మ ప్రొడక్షన్స్, ఆర్కా మీడియా సంస్థలు కూడా ఆరేళ్ళ బాహుబలిని సోషల్ మీడియాలో గుర్తు చేసుకుంటున్నాయి.
తమన్నా అందాలు, విజువల్స్, కట్టప్ప ఫైట్, కాలకేయులు వార్, కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు.. లాంటి అంశాలు మొదటి భాగంలో హైలైట్ గా నిలిచాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments