Actor Naresh:త్వరలో ప్రెస్‌మీట్ పెట్టి అన్నీ చెబుతా - పవిత్రా లోకేష్‌తో పెళ్లి వీడియోపై నరేష్ రియాక్షన్
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సీనియర్ నటులు నరేష్, పవిత్రా లోకేష్‌లు పెళ్లి చేసుకుంటారని ఎప్పటి నుంచో కథనాలు వినిపిస్తున్నాయి. అటు ఈ జంట కూడా తాము ఏడాది పెళ్లి పీటలెక్కుతామని ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. అంతకుమించి నాటి నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా ఈరోజు వీరిద్దరూ సడెన్‌గా పెళ్లి పీటలపై కనిపించి షాకిచ్చారు. ఈ మేరకు రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ''ఒక పవిత్ర బంధం... రెండు మనసులు... మూడు ముళ్ళు... ఏడు అడుగులు! మీ ఆశీస్సులు కోరుకుంటూ పవిత్రా నరేష్'' అని ట్వీట్ చేశారు.
ఇంటింటి రామాయణం ప్రెస్‌మీట్‌లో నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు :
దీంతో శుక్రవారం ఉదయం నుంచి సినీ పరిశ్రమలో వీరిద్దరి వ్యవహారంపై పెద్ద చర్చ నడిచింది. నరేష్, పవిత్రా లోకేష్‌లు నిజంగానే పెళ్లి చేసుకున్నారా లేక ఏదైనా సినిమా కోసం చేసుకున్నారా అంటూ డిస్కషన్ నడిచింది. ఈ నేపథ్యంలో ఇంటింటి రామాయణం సినిమా ప్రెస్‌మీట్ జరిగింది. ఈ సందర్భంగా నరేష్‌ను మీడియా పెళ్లి వీడియోపై ప్రశ్నించింది. దీనికి ఆయన ‘‘ఇంటింటి రామాయణం.. వింతైన ప్రేమాయణం’’ అంటూ బదులిచ్చారు. తాను త్వరలోనే ప్రెస్ మీట్ పెడతానని.. రియల్ లైఫ్ , రీల్ లైఫ్ అనేవి ప్రతి వ్యక్తికీ ఉంటుందని నరేష్ వ్యాఖ్యానించారు. తన జీవితం తాను జీవిస్తానని.. తాను నమ్మేది అదేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా విషయాలను తాను డైవర్ట్ చేయాలని అనుకోవడం లేదని నరేష్ అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టారు. కాగా.. కొద్దిరోజుల క్రితం నరేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పవిత్రా లోకేష్‌పై తన బంధానికి సంబంధించి కొందరు హద్దులు మీరి ట్రోలింగ్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెడుతున్నారని నరేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వెనుక కొందరున్నారని చెప్పిన ఆయన ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించారు.
గతేడాది సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేష్:
ఇకపోతే.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు సంబంధించి పవిత్రా లోకేష్ గతేడాది నవంబర్ 26న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనతో రిలేషన్‌లో వున్న నరేష్‌పైనా, తనపైనా కొన్ని వెబ్‌సైట్లు, ఛానెళ్స్ ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని పవిత్రా లోకేష్ తెలిపారు. దీనిపై స్పందించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఫిర్యాదు స్వీకరించామని .. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పలు యూట్యూబ్ ఛానెల్స్‌కు కూడా నోటీసులు ఇచ్చారు.
టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను కుదిపేసిన పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్‌షిప్:
కాగా... పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్‌షిప్ వ్యవహారం టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను ఈ ఏడాది ఓ కుదుపు కుదిపింది. నరేష్, పవిత్రా లోకేష్‌ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిని ఇద్దరిలో ఎవ్వరూ ఖండించలేదు. కానీ చివరికి అవే నిజమయ్యాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా, కలిసేవుంటున్నారు. ఇదే సమయంలో నరేష్ మూడో భార్య రమ్య రఘపతి వీరిద్దరిని మైసూరులోని ఓ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాకుండా, చెప్పుతో కొట్టేందుకు సిద్ధమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments