Naresh and Pavitra:ఒక్కటైన పవిత్రా-లోకేష్.. సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కి షాకిచ్చిన జంట, వీడియో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
సస్పెన్స్‌కు తెరపడింది.. సీనియర్ నటుటు నరేష్- పవిత్రా లోకేష్‌లు ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కారు. అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేసిన ఈ కపుల్ తమకు ఆశీస్సులు అందించాల్సిందిగా కోరారు. ‘‘ ఒక పవిత్ర బంధం .. రెండు మనసులు.. మూడు ముళ్ళు .. ఏడు అడుగులు , మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్రా నరేష్ ’’ అంటూ నరేష్ ట్వీట్ చేశారు. పెళ్లి దుస్తుల్లో ఈ జంట చూడముచ్చటగా వున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ , తెలుగు సాంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు.
టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను కుదిపేసిన పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్‌షిప్:
పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్‌షిప్ వ్యవహారం టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను ఈ ఏడాది ఓ కుదుపు కుదిపింది. నరేష్, పవిత్రా లోకేష్‌ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిని ఇద్దరిలో ఎవ్వరూ ఖండించలేదు. కానీ చివరికి అవే నిజమయ్యాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా, కలిసేవుంటున్నారు. ఇదే సమయంలో నరేష్ మూడో భార్య రమ్య రఘపతి వీరిద్దరిని మైసూరులోని ఓ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాకుండా, చెప్పుతో కొట్టేందుకు సిద్ధమైంది.
సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియల నాడు పక్కపక్కనే:
నరేష్, పవిత్రలు తమకు వయసుకు తగ్గట్టుగా హీరో హీరోయిన్లకు తల్లిదండ్రులుగా, అత్తామామలుగా నటిస్తూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం.. రిలేషన్‌షిప్ వరకు వెళ్లిందని ఫిలింనగర్ జనాలు చెబుతూ వుంటారు. ఇక తమ వ్యవహారం అందరికీ తెలిసిపోవడంతో ఇద్దరూ నిర్భయంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల మరణించిన టాలీవుడ్ దిగ్గజం, సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల సమయంలోనూ వీరిద్దరూ పక్కపక్కనే వున్నారు. ఈ ఘటనకు ముందు నరేష్ - పవిత్రా లోకేష్‌లను వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా జనాలు అంతగా పట్టించుకోలేదు. కానీ కృష్ణ మరణానంతరం విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఇది శృతి మించడంతోనే పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
లిప్ కిస్ పెట్టుకున్న నరేశ్-పవిత్రా లోకేష్:
అయితే న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని ఈ సస్పెన్స్‌కు తెరదించారు నరేశ్- పవిత్రా లోకేష్. తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఓ వీడియో వదిలారు. సినిమా ప్రోమోకు ఏ మాత్రం తగ్గని విధంగా కట్ చేసిన ఆ వీడియోలో నరేశ్, పవిత్ర కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోవడమే కాకుండా ఇద్దరూ లిప్ కిస్ ఇచ్చుకుని కలకలం రేపారు. 2023లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తమ జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభమవుతోందని... అంతా తమను ఆశీర్వదించాలని ఈ జంట ప్రేక్షకులను కోరింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com