Super Star Krishna : ఆసుపత్రిలో సూపర్‌స్టార్ కృష్ణ.. స్పందించిన నరేశ్

  • IndiaGlitz, [Monday,November 14 2022]

దిగ్గజ నటుడు , సూపర్‌స్టార్ కృష్ణ అస్వస్థతకు గురయ్యారన్న వార్తలతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. మీడియాలో రకరకాలుగా కథనాలు రావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై నరేశ్ స్పందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే వుందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రోటిన్ హెల్త్ చెకప్‌లో భాగంగానే కృష్ణ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. 24 గంటల్లోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని నరేశ్ పేర్కొన్నారు.

కాగా.. సూపర్‌స్టార్ కృష్ణ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు సోమవారం హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కృష్ణను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. దీంతో కృష్ణ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

కృష్ణ కుటుంబంలో వరుస మరణాలు :

కాగా... ఈ ఏడాది జనవరిలో కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీని నుంచి ఆ కుటుంబం ఇంకా కోలుకోకముందే ఆయన సతీమణి ఇందిరా దేవి కన్నుమూశారు. అయితే కృష్ణ స్టార్‌గా ఎదుగుతున్న సమయంలో తన సహ నటి విజయ నిర్మలను ద్వితీయ వివాహం చేసుకున్నారు. అయితే ఆమె కూడా 2019లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. విజయ నిర్మల, రమేశ్‌ బాబు, ఇందిరా దేవిల వరుస మరణాలతో సూపర్‌స్టార్ కృష్ణకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయ్యింది. ఐదేళ్ల క్రితం శ్రీశ్రీ చిత్రంలో నటించిన తర్వాత కృష్ణ సినిమాలకు దూరంగా వుంటూనే వస్తున్నారు.

More News

Super Star Krishna : సూపర్‌స్టార్ కృష్ణకు అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు, హెల్త్ బులెటిన్ విడుదల

దిగ్గజ నటుడు, టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రికి

బిగ్‌బాస్ మరో షాక్... బాలాదిత్య ఎలిమినేషన్, హౌస్‌మెట్స్‌కి ఏం చెప్పాడంటే..?

గడిచిన రెండు వారాలుగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి షాకిస్తున్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆర్జే సూర్యను బట్టలు సర్దుకోమన్న బిగ్‌బాస్.. తర్వాత వారం గలాటా గీతూను బయటికి తరిమేశాడు.

ys sharmila: కమలం వికసిస్తుందని.. మా చెవిలో ఎన్ని పూలు పెడతారు : మోడీపై షర్మిల సెటైర్లు

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Alipiri Allantha Dhuramlo: 'అలిపిరికి అల్లంత దూరంలో " థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన దర్శకుడు మారుతి

కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'.

Meet Cute: 'మీట్ క్యూట్' టీజర్ విడుదల

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న  ఎంథాలజీ "మీట్ క్యూట్"