నాపైనా, నా ఫ్యామిలీపైనా ట్రోలింగ్.. ఓ ఇద్దరు హీరోల పనే ఇది, శిక్ష తప్పదు : మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
తనపైనా, తన కుటుంబంపైనా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారికి కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చారు. టాలీవుడ్‌కి చెందిన ఓ ఇద్దరు హీరోలు దీని వెనుక వున్నారని.. ట్రోలింగ్, మీమ్స్ కోసం ఓ వందమందిని వారిద్దరూ నియమించుకున్నట్లు తెలిసిందని మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంతో మోహన్ బాబు హీరోగా మంచు విష్ణు తెరకెక్కించిన ‘‘సన్ ఆఫ్ ఇండియా’’ ఫిబ్రవరి 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మోహన్ బాబు రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
‘ట్రోల్స్, మీమ్స్ అనేవి సరదాగా నవ్వుకునేలా ఉండాలి కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని మోహన్ బాబు హితవు పలికారు. సాధారణంగా తాను ట్రోలింగ్స్, మీమ్స్‌ను పట్టించుకోనని.. ఎవరైనా నాకు పంపినప్పుడే చూస్తానని ఆయన చెప్పారు. అయినా వాటిని పెద్దగా పట్టించుకోలేదని... కానీ ఇటీవల ఇవి హద్దులు మీరుతున్నాయని, ఇలాంటి వాటిని చూసినప్పుడు బాధగా ఉంటుందని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎదుటి వారిని ట్రోలింగ్ చేయొచ్చేమో తనకు తెలియదని.. కానీ వ్యంగ్యంగా ట్రోల్ చేయడం అనేది బాధ కలిగిస్తుందన్నారు. ట్రోలింగ్ చేయిస్తున్న ఇద్దరు హీరోలెవరో తనకు తెలుసునని.. వారిని ప్రకృతి గమనిస్తోందని మోహన్ బాబు అన్నారు. ఇప్పుడు వారికి బాగానే ఉండవచ్చు.. కానీ ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తారని, ఆ సమయంలో వారికి ఎవరు అండగా నిలవరని పెదరాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ మోహన్ బాబు చెప్పిన ఆ ఇద్దరు హీరోలు ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com