మణిరత్నం సినిమాని వదులుకున్న నటుడు
Send us your feedback to audioarticles@vaarta.com
మణిరత్నం.. భారతీయ సినీ ప్రేక్షకులకి పరిచయం చేయనక్కర్లేని లెజండరీ దర్శకుడి పేరిది. ఫలితాలతో సంబంధం లేకుండా తన అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేసుకుపోతుంటారు ఈ దర్శకదిగ్గజం. ప్రస్తుతం మణిరత్నం.. ఓ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శింబు, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, అరవింద్ స్వామి, జ్యోతిక, అదితిరావ్ హైదరి, ప్రకాష్ రాజ్, జయసుధ, ఐశ్వర్య రాజేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే.. ఈ సినిమా నుంచి మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తప్పకున్నారన్నదే ఆ వార్త సారాంశం. కాల్షీట్ల సమస్య కారణంగానే ఫహద్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చారని ప్రముఖంగా కథనాలు వినిపిస్తున్నాయి. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments