పిడి గుద్దుల్లాంటి పంచ్ లు.. వరుణ్ తేజ్ భీకరమైన బాక్సింగ్ పోరాటం!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న హై యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా 'గని' చివరి షెడ్యూల్ కి చేరుకుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. కెరీర్ ఆరంభం నుంచి వరుణ్ విభిన్నమైన కథలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు.
ఆ పంథాలోనే కొనసాగుతూ బాక్సింగ్ నేపథ్యం ఉన్న ఈ చిత్రానికి అంగీకారం తెలిపాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి కావలసిన ఈ చిత్రం కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రం చివరి షెడ్యూల్ కు చేరుకుంది. ఈ షెడ్యూల్ లో వరుణ్ తేజ్ హై ఓల్టేజ్ బాక్సింగ్ యాక్షన్ ఎపిసోడ్ లో నటించబోతున్నాడు.
దీనికోసం ప్రత్యేకంగా బాక్సింగ్ కోర్టు సెట్ నిర్మించారు. ఈ పర్టికులర్ యాక్షన్ సీన్ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ లెర్నల్ స్టోవెల్, వాల్డ్ రీయింబర్గ్ రంగంలోకి దిగారట. వీరు టైటాన్స్, సల్మాన్ ఖాన్ సుల్తాన్ లాంటి చిత్రాలకు పనిచేశారు. భీకరంగా సాగే ఈ యాక్షన్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని టాక్.
దబంగ్ 3 ఫేమ్ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ కి హీరోయిన్ గా నటిస్తోంది. సిద్దు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చివరి షెడ్యూల్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి థియేట్రికల్ రిలీజ్ చేయాలనేది ప్లాన్. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
గనితో పాటు వరుణ్ ప్రస్తుతం ఎఫ్3లో కూడా నటిస్తున్నాడు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com