close
Choose your channels

మోహన్ బాబుపై వ్యక్తిగత దూషణలు, బూతులతో.. పోలీసులకు ఫిర్యాదు

Saturday, July 10, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీనియర్ నటుడు మోహన్ బాబు సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించారు. తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ అసభ్యకరమైన వీడియోల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు మోహన్ బాబు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు మోహన్ బాబుని యూట్యూబ్ లో టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

పొలిటికల్ మోజో అనే యూట్యూబ్ ఛానల్ మోహన్ బాబుని వ్యక్తిగతంగా దూషించడమే కాక బూతులతో అసభ్యకరమైన వీడియోల్ని పోస్ట్ చేస్తుందనేది ఆరోపణ. కొన్ని ఆధారాలని కూడా మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారట. తాను మాట్లాడిన స్పీచ్ లని మార్ఫింగ్ చేస్తూ అసభ్యంగా వైరల్ చేస్తున్నట్లు మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మోహన్ బాబు తరుపున ఆయన లీగల్ అడ్వైజర్ సంజయ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించారు. సోషల్ మీడియాలో సెలెబ్రిటీలపై ట్రోలింగ్ ప్రస్తుతం సాధారణంగా మారిపోయింది. కానీ శృతి మించేలా మోహన్ బాబు కుటుంబ సభ్యులని కూడా ఇందులోకి లాగుతుండడంతో ఆయన పోలీసులని ఆశ్రయించారు.

మోహన్ బాబు టాలీవుడ్ లో సీనియర్ నటుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం నుంచి ఓ సాంగ్ కూడా రిలీజ్ అయింది.

ఇదిలా ఉండగా మోహన్ బాబు పెద్ద కుమారుడు, హీరో విష్ణు త్వరలో జరగబోయే మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేయబోతున్నాడు. ఇప్పటికే మోహన్ బాబు, విష్ణు టాలీవుడ్ లో సీనియర్స్ మద్దతు కూడగట్టినట్లు టాక్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment