టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ రచయిత, సినీ నటుడు జాన్ కొట్టొలీ ఇవాళ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రగతినగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. జాన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన మృతి చెందినట్లు తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. రేపు అనగా బుధవారం నాడు జాన్ భౌతిక కాయాన్ని కేరళకు తరలించనున్నారని తెలుస్తోంది.
కాగా.. ఈయన స్వస్థలం కేరళ కాగా సినిమాలపై ఆసక్తితో టాలీవుడ్‌కు వచ్చిన ఆయన పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. మరీ ముఖ్యంగా ‘ఫలక్‌నుమాదాస్’, ‘మను’, ‘రక్తం’, ‘యుద్ధం శరణం’తో పాటు పలు చిత్రాల్లో నటించిన ఆయన టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అంతేకాకుండా.. ‘సైన్మా’ అనే లఘు చిత్రం, ‘గాడ్’ వెబ్‌సిరీస్‌లో జాన్ నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com