ఎవరెప్పుడు పోతారో తెలియట్లేదు: జగపతిబాబు భావోద్వేగం
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంలో విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్‌లో లక్షల్లో ప్రజలు కరోనా బారిన పడుతుండగా.. వేలల్లో కరోనాతో మరణిస్తున్నారు. భారత్‌లో ఎక్కడ చూసినా మరణాలు భారీగా నమోదవుతున్నాయి. శ్మశానాల్లో సైతం హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. సెకండ్ వేవ్ ఇంత దారుణంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కాగా.. కరోనాతో ప్రముఖ నటుడు జగపతి బాబు అభిమాని శ్రీను మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జగపతి బాబు ఓ భావోద్వేగ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎవరు ఎప్పుడు పోతారో తెలియడం లేదని జాగ్రత్తగా ఉండాలని వీడియోలో జగపతిబాబు సూచించారు.
Also Read: ఆరోగ్యశాఖ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం!
‘‘20 ఏళ్లుగా నా అభిమానిగా.. గుంటూరు అభిమాన సంఘం ప్రెసిడెంట్‌గా ఉన్న శ్రీను నేడు కోవిడ్‌తో చనిపోయారు. నాకు చాలా బాధగా ఉంది. అతని భార్య కోటేశ్వరిగారు, మహేష్.. ఇంకో అబ్బాయికి నాపేరే పెట్టాడు జగపతి అని.. వీరందరికీ ఎప్పటికీ నా అండ ఉంటుంది. శ్రీను.. ఐ మిస్ యూ. ఇప్పటికైనా మీరందరూ నేర్చుకోండి. మాస్కులు పెట్టుకోవాలి. శానిటైజర్ వాడాలి. ఇప్పటికైనా తెలుసుకోండి. కళ్ల ముందే ఎంతో మంది పోతున్నారు. ఎవరెప్పుడు పోతారో తెలియడం లేదు’’ అని జగపతి బాబు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com