ఎవరెప్పుడు పోతారో తెలియట్లేదు: జగపతిబాబు భావోద్వేగం

  • IndiaGlitz, [Wednesday,May 05 2021]

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంలో విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్‌లో లక్షల్లో ప్రజలు కరోనా బారిన పడుతుండగా.. వేలల్లో కరోనాతో మరణిస్తున్నారు. భారత్‌లో ఎక్కడ చూసినా మరణాలు భారీగా నమోదవుతున్నాయి. శ్మశానాల్లో సైతం హౌస్‌ ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. సెకండ్ వేవ్ ఇంత దారుణంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కాగా.. కరోనాతో ప్రముఖ నటుడు జగపతి బాబు అభిమాని శ్రీను మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జగపతి బాబు ఓ భావోద్వేగ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎవరు ఎప్పుడు పోతారో తెలియడం లేదని జాగ్రత్తగా ఉండాలని వీడియోలో జగపతిబాబు సూచించారు.

Also Read: ఆరోగ్యశాఖ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం!

‘‘20 ఏళ్లుగా నా అభిమానిగా.. గుంటూరు అభిమాన సంఘం ప్రెసిడెంట్‌గా ఉన్న శ్రీను నేడు కోవిడ్‌తో చనిపోయారు. నాకు చాలా బాధగా ఉంది. అతని భార్య కోటేశ్వరిగారు, మహేష్.. ఇంకో అబ్బాయికి నాపేరే పెట్టాడు జగపతి అని.. వీరందరికీ ఎప్పటికీ నా అండ ఉంటుంది. శ్రీను.. ఐ మిస్ యూ. ఇప్పటికైనా మీరందరూ నేర్చుకోండి. మాస్కులు పెట్టుకోవాలి. శానిటైజర్ వాడాలి. ఇప్పటికైనా తెలుసుకోండి. కళ్ల ముందే ఎంతో మంది పోతున్నారు. ఎవరెప్పుడు పోతారో తెలియడం లేదు’’ అని జగపతి బాబు తెలిపారు.

More News

ఆరోగ్యశాఖ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం!

తెలంగాణలో రాజకీయపరంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. మినీ మునిసిపల్ ఎన్నికలు ముగిశాయో లేదో..

హైదరాబాద్ జూలోని 8 సింహాలకూ కరోనా.. అసలెలా సోకిందంటే..

కరోనా సెకండ్ వేవ్ ఊహించని రీతిలో ప్రళయం సృష్టిస్తోంది. మనుషులకే కాదు.. జంతువులకు సైతం వ్యాపించి షాకిస్తోంది.

మమతా మోహన్‌దాస్ బోల్డ్ ఫోటోషూట్.. నెటిజన్లు ఫిదా..

ఫొటోషూట్‌లు చేసే కొద్దిమంది నటీమణులలో మోలీవుడ్ ముద్దుగుమ్మ మమతా మోహన్‌దాస్ ఒకరు.

నేటి నుంచి ఏపీలో కర్ఫ్యూ.. కఠిన నిబంధనల అమలు

కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నేటి(బుధవారం) నుంచి కట్టుదిట్టమైన నిబంధనలతో కర్ఫ్యూ అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది.

‘వకీల్ సాబ్’ సినిమాపై కేసు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల పాటు గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘వకీల్ సాబ్’. ఈ చిత్రం పవన్‌కు మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది.