హీరోతో కాజల్ కికి చాలెంజ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక్కొక్కసారి ఓ చాలెంజ్ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమాని ట్రెండింగ్‌లో ఉన్న చాలెంజ్ ...కికి ఛాలెంజ్.. గత కొంత కాలంగా ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఛాలెంజ్ ఇది. కారులోంచి దిగి కికి అనే పాటకు స్టెప్‌లు వేసి ఆ తరువాత మళ్లీ కారులోకి ఎక్కడమే ఈ ఛాలెంజ్. ఇక మనదేశంలోనూ ఈ ఛాలెంజ్ విస్తరించింది. టాలీవుడ్ హీరోయిన్స్ ఆదా శర్మ, రెజీనా తదితరులు కికి చాలెంజ్‌లో పాల్గొన్నారు.
అయితే దీని వల్ల కొందరు చనిపోయారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. అందువల్ల హైదరాబాద్ పోలీసులు హెచ్చరించడంతో ఆ తరువాత కాస్త తగ్గుముఖం పట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఛాలెంజ్‌ను కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి వెరైటీగా ప్రయత్నించారు. వీల్ చైర్‌లోంచి దిగి ఈ పాటకు స్టెప్‌లు వేశారు. జాగ్రత్త లేకుండా కికి ఛాలెంజ్‌ను చేస్తే దెబ్బలు తగిలి, తమలా అవుతారని, ఇలా వీల్‌చైర్‌లోనే ఉంటారని ఆ తరువాత ఈ ఇద్దరు చెప్పారు.
కాగా ప్రస్తుతం ఈ ఇద్దరు శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా.. షూటింగ్ మధ్యలో ఇలా ఛాలెంజ్‌ను చేశారు కాజల్, శ్రీనివాస్ ఈ కికి చాలెంజ్‌ను వినూత్నంగా చేయడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com