‘అమ్మరాజ్యం..’పై రీల్ చంద్రబాబు ఏమన్నారంటే...

  • IndiaGlitz, [Thursday,December 12 2019]

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ చిత్రం ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్‌కు కొన్ని గంటల ముందు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గురువారం నాడు డిసెంబర్-12న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా రకరకాలుగా టాక్‌ నడుస్తోంది. ఈ సినిమా సూపర్బ్ అని కొందరు.. అబ్బే దీన్ని సినిమా అంటారా..? దీనికంటే జబర్దస్త్ కామెడీ షో బెటర్ అని మరికొందరు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే ఈ సినిమాపై తాజాగా ‘అమ్మరాజ్యం..’లో నటించిన చంద్రబాబు పోలిన వ్యక్తి (ధనుంజయ ప్రభు) తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఓ థియేటర్‌ వద్ద మీడియా మిత్రులు పలకరించగా ఇలా చెప్పుకొచ్చాడు.

కామెడీ సినిమాగానే చూడండి!

‘పబ్లిక్ రెస్పాన్స్ బాగుంది. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతుందన్న నమ్మకం నాకుంది. అమ్మ రాజ్యంలో.. హాస్య చిత్రాన్ని ప్రతిఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రాన్ని రాజకీయ కోణంలో చూడొద్దండి’ అని ధనుంజయ చెప్పుకొచ్చారు. కాగా.. కొత్త చిత్రాల్లో నటిస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వస్తే ఏ పాత్రలో అయినా నటించడానికి తాను రెడీగా ఉన్నానని తెలిపారు. కాగా.. ఇటీవలే రియల్ చంద్రబాబును కలిసి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని రీల్ చంద్రబాబు‌కు ఉందని ఇటీవలే ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ ట్విట్టర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

More News

మాది గురుశిష్యుల సంబంధం గొల్లపూడి మృతి పై మెగాస్టార్ చిరంజీవి స్పందన

గొల్లపూడి మారుతిరావుతో తనకున్నది గురుశిష్య సంబంధమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన మరణం పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. '

అయోధ్యపై ‘నవంబర్- 9’ నాటి తీర్పే ఫైనల్.. మార్పులుండవ్!

దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య కేసు వివాదానికి నవంబర్-09తో సుప్రీంకోర్టు ముగింపు పలికిన సంగతి తెలిసిందే.

సింగిల్ విండో విధానంలో సినిమా షూట్స్‌కు తలసాని గ్రీన్ సిగ్నల్

సింగిల్‌ విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

గొల్లపూడి మృతిపట్ల ప్రముఖుల సంతాపం

ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మృతిపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో ‘వార్’ సీన్.. బాబుకు జగన్ సవాల్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు మధ్యాహ్నం వాడీవేడిగా సాగాయి. ఇప్పటికే మూడుబిల్లులను ప్రవేశపెట్టిన జగన్ సర్కార్..