Telugu Film Industry : జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం.. పోలీసుల అదుపులో వర్ధమాన నటుడు, టాలీవుడ్‌లో కలకలం
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. పోలీసులు ఎంతగా నిఘా పడుతున్నా మన సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. అపరిచితులే అనుకుంటే ఇంట్లోని తండ్రి, సోదరులు, మేనమామ ఇలా రక్త సంబంధం వున్నవాళ్లే ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా జూనియర్ ఆర్టిస్ట్‌పై వర్ధమాన నటుడు అత్యాచారం చేసిన ఘటన టాలీవుడ్‌లో కలకలం రేపింది. నిందితుడిని ప్రియంత్ రావుగా గుర్తించారు. ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో నమ్మించి రేప్ చేసినట్లుగా తెలుస్తోంది. నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
డబ్బులు ఇస్తానని పిలిచి .. గదిలో బంధించి అత్యాచారం:
ఇకపోతే.. గత ఆగస్ట్‌లో హైదరాబాద్ ఇందిరా నగర్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌ను బెదిరించి , ఆమెను గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందిరా నగర్‌లో నివసించే ఓ 22 ఏళ్ల యువతి తనకు కొంత డబ్బు అవసరమై ఇంటి దగ్గరలోనే బాలు నాయక్ అనే యువకుడిని అడిగింది. అతను డబ్బులు ఇస్తానని చెప్పి.. లోపలికి పిలిచి బంధించి అత్యాచారం చేశాడు. అక్కడితో ఆగకుండా తన స్నేహితుడితో గడిపితే రూ.5 వేలు ఇస్తానంటూ కండీషన్ పెట్టాడు. బాధితురాలు వారి బారి నుంచి తప్పించుకుని స్నేహితురాలికి చెప్పింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments