కోలీవుడ్‌లో కరోనా కలకలం.. హీరో అరుణ్ విజయ్‌కు పాజిటివ్, ఆందోళనలో ఫ్యాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో కరోనా కేసులు మరోసారి ఊహకందని వేగంతో పెరుగుతున్నాయి. గురువారం ఒక్కసారిగా 90 వేల కొత్త కేసులు నమోదవ్వగా.. 325 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్ధితి చూస్తుంటే నిపుణులు చెప్పినదాని కంటే ముందే కరోనా థర్డ్ వేవ్ వచ్చేలా కనిపిస్తోంది. మరోవైపు దేశంలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
తాజాగా తమిళ చిత్ర సీమలో కోవిడ్ కలకలం రేగింది. యువ నటుడు అరుణ్ విజయ్‌కి వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ''అందరికీ నమస్కారం!! నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. డాక్టర్ల సూచన మేరకు నేను హోం క్వారంటైన్ లో ఉన్నా. అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నా. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి''’అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు అరుణ్. ‘బ్రూస్‌లీ’, ‘సాహో’ సినిమాలతో ఆయన తెలుగు వారిని సైతం పలకరించారు. ప్రభాస్ హీరోగా నటించిన సాహో అరుణ్ చివరి చిత్రం. ఇటీవల ఆయన 25వ చిత్రం ‘‘తాడం’’ విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో అరుణ్ బిజీ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఆరు చిత్రాలు వున్నాయి.
కాగా.. దేశంలో ప్రస్తుతం కోలీవుడ్‌లోనే అత్యధిక సంఖ్యలో సెలబ్రెటీలు కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్, విక్రం, వడివేలులకు వైరస్ పాజిటివ్‌గా తేలడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. తాజాగా అరుణ్ విజయ్‌కి కరోనా సోకడంతో కోలీవుడ్ ఉలిక్కిపడింది. వీరితో పాటు కరీనా కపూర్, అమృత అరోరా, మంచు మనోజ్, నోరా ఫతేహి, మీనా కుటుంబం వైరస్ బారినపడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com