కోలీవుడ్‌లో కరోనా కలకలం.. హీరో అరుణ్ విజయ్‌కు పాజిటివ్, ఆందోళనలో ఫ్యాన్స్

  • IndiaGlitz, [Thursday,January 06 2022]

దేశంలో కరోనా కేసులు మరోసారి ఊహకందని వేగంతో పెరుగుతున్నాయి. గురువారం ఒక్కసారిగా 90 వేల కొత్త కేసులు నమోదవ్వగా.. 325 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్ధితి చూస్తుంటే నిపుణులు చెప్పినదాని కంటే ముందే కరోనా థర్డ్ వేవ్ వచ్చేలా కనిపిస్తోంది. మరోవైపు దేశంలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

తాజాగా తమిళ చిత్ర సీమలో కోవిడ్ కలకలం రేగింది. యువ నటుడు అరుణ్ విజయ్‌కి వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ''అందరికీ నమస్కారం!! నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. డాక్టర్ల సూచన మేరకు నేను హోం క్వారంటైన్ లో ఉన్నా. అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నా. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి''’అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు అరుణ్. ‘బ్రూస్‌లీ’, ‘సాహో’ సినిమాలతో ఆయన తెలుగు వారిని సైతం పలకరించారు. ప్రభాస్ హీరోగా నటించిన సాహో అరుణ్ చివరి చిత్రం. ఇటీవల ఆయన 25వ చిత్రం ‘‘తాడం’’ విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో అరుణ్ బిజీ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఆరు చిత్రాలు వున్నాయి.

కాగా.. దేశంలో ప్రస్తుతం కోలీవుడ్‌లోనే అత్యధిక సంఖ్యలో సెలబ్రెటీలు కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్, విక్రం, వడివేలులకు వైరస్ పాజిటివ్‌గా తేలడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. తాజాగా అరుణ్ విజయ్‌కి కరోనా సోకడంతో కోలీవుడ్ ఉలిక్కిపడింది. వీరితో పాటు కరీనా కపూర్, అమృత అరోరా, మంచు మనోజ్, నోరా ఫతేహి, మీనా కుటుంబం వైరస్ బారినపడింది.

More News

చట్టానికి సహకరిస్తా.. నా కొడుకును దూరం పెడతా: ప్రజలకు ఎమ్మెల్యే వనమా బహిరంగ లేఖ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ అనే వ్యక్తి భార్య, ఇద్దరు ఆడపిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.

ఐదు భాషల్లో  21న "వర్మ'' (వీడు తేడా) ఆగమనం

నట్టిక్రాంతి హీరోగా ఐదు భాషల్లో రూపొందిన చిత్రం "వర్మ'' (వీడు తేడా). ఇందులో నట్టి క్రాంతి సరసన హీరోయిన్లుగా ముస్కాన్ ,సుపూర్ణ మలాకర్, సందడి చేస్తున్నారు.

పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య.. ఎట్టకేలకు వనమా రాఘవ అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం తెలుగు నాట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

‘‘ నా భార్యను పంపమన్నాడు’’.. రామకృష్ణ సెల్ఫీ వీడియో , వనమా రాఘవకు బిగుస్తోన్న ఉచ్చు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య ఘటన కీలక మలుపు తిరిగింది.

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 'శేఖర్' ఫస్ట్ సింగిల్ "లవ్ గంటే మోగిందంట" విడుదల

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'శేఖర్'. హీరోగా ఆయన 91వ చిత్రమిది.