పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆ పార్టీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆయనకు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న అనంతరం జనసేనాని హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆ తరువాత నలతగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి. అయినప్పటికీ వైద్యుల సూచన మేరకు పవన్ తన వ్యవసాయక్షేత్రంలోని క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఆయన రెండు రోజుల కిందట మరోసారి పరీక్ష చేయించుకోగా ఫలితం పాజిటివ్ అని తేలింది. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్ హైదరాబాద్‌కు వచ్చి పవన్‌కు చికిత్సను అందిస్తున్నారు. అవసరమైన ఇతర పరీక్షలన్నీ నిర్వహించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటీ వైరల్ మందులతో చికిత్సను అందిస్తున్నారు. అవరసమైనప్పుడు ఆక్సిజన్‌ను సైతం అందిస్తున్నారు. పవన్ ఆరోగ్యం గురించి ఆయన అన్నావదినలు చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
పవన్ వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్సకు కావల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి పవన్‌ను పరీక్షించింది. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ వెల్లడించారు. పవన్‌కు డాక్టర్ సుమన్ అత్యంత ఆస్తులు కావడంతో ఫ్యామిలీ మెడికల్ అడ్వైజర్‌గా కొనసాగుతున్నారు. గత వారం రోజులుగా వపన్‌కు వెన్నంటే ఉంటూ సుమన్ వైద్య సేవలు అందిస్తున్నారు. నిర్మాత నాగ వంశీ సైతం గత వారం రోజులుగా పవన్‌తో ఉంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments