Amardeep - Tejaswini Gowda Wedding: ఘనంగా అమర్ దీప్, తేజశ్విని వివాహం.. ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం వెండితెర, బుల్లితెర నటీనటులు తమ బ్యాచిలర్ లైఫ్‌కి ఫుల్ స్టాప్ పెట్టి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. వీరిలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు కొందరైతే.... తమ కో స్టార్‌తో ప్రేమలో పడి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి పీటలెక్కిన వారు మరికొందరు. తాజాగా బుల్లితెర నటులు అమర్‌దీప్ చౌదరి- తేజస్విని గౌడ. వీరి వివాహం డిసెంబర్ 14న బెంగళూరులో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ ప్రారంభించిన అమర్‌దీప్:
అనంతపురంలో జన్మించిన అమర్‌దీప్ చౌదరి... బీటెక్ పూర్తయ్యాక, యూకేలో మాస్టర్స్ చదివాడు. విద్యాభ్యాసం తర్వాత కొంతకాలం ఓ కంపెనీలో పనిచేసిన అతనికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే షార్ట్ ఫిలింస్‌తో ఎంట్రీ ఇచ్చిన అమర్‌దీప్ చౌదరి.. సూపర్‌మచ్చి, రాజధాని లవ్ స్టోరీ వంటి పలు వెబ్‌సిరీస్‌లలో నటించాడు. తర్వాత సిరిసిరిమువ్వ, ఉయ్యాల జంపాల సీరియల్స్‌తో తెలుగు లొగిళ్లకు దగ్గరయ్యాడు అమర్‌దీప్. ప్రస్తుతం ఆయన జానకి కలగనలేదులో హీరోగా నటిస్తున్నారు. అలాగే కృష్ణార్జున యుద్ధం, శైలజా రెడ్డి అల్లుడు, సారధి, ఎవరు సినిమాల్లోనూ అమర్‌దీప్ నటించారు.
కోయిలమ్మ సీరియల్‌తో పాపులర్ అయిన తేజస్విని గౌడ:
ఇక తేజస్విని విషయానికి వస్తే .. బెంగళూరులో పుట్టిన ఈమె బీటెక్ పట్టభద్రురాలు. తమిళం, కన్నడలో అనేక సీరియల్స్‌లో నటించిన ఆమె తెలుగులో కోయిలమ్మ సీరియల్‌తో పాపులర్ అయ్యింది. ప్రస్తుతం తేజస్విని కేరాఫ్ అనసూయ సీరియల్‌లో నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments