అమాయక చక్రవర్తిగా మారనున్న యాక్షన్ హీరో!
Send us your feedback to audioarticles@vaarta.com
‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’, ‘జయ జానకి నాయక’, ‘సాక్ష్యం’.. ఇలా వరుసగా యాక్షన్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా..అందులో ఒకటి సంచలన దర్శకుడు తేజ డైరెక్షన్‌లో రూపొందబోతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
అది ఏమిటంటే.. ఈ సినిమాలో శ్రీనివాస్ అమాయకంగా కనిపించే పాత్రలో నటిస్తున్నారట. ఇది పెర్ఫార్మన్స్‌కి స్కోప్ ఉండే పాత్ర అని కూడా తెలుస్తోంది. మరి ఇంతవరకు యాక్షన్ హీరో అనిపించుకున్న ఈ హీరో.. ఇప్పుడు మంచి నటుడు అని కూడా అనిపించుకునే పనిలో ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ హీరో సినిమాలకి హిందీలో డిజిటల్, శాటిలైట్ హక్కులు ఎక్కువ ధరకు అమ్ముడు పోతాయి. అందుకే వాటిని దృష్టిలో పెట్టుకుని.. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో పాటు సెకండ్ హాఫ్‌లో మంచి యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేసారని వినికిడి. కాగా.. ఈ సినిమాలో సోనూ సూద్ విలన్‌గా నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్ వరుసగా రెండోసారి శ్రీనివాస్‌తో కలిసి తెరను పంచుకోనుంది. మరి తేజ సిద్ధం చేసిన ఈ అమాయక చక్రవర్తి కథ.. ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments