ఆసక్తిరేపుతున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా `హిట్`(ట్రైలర్ రివ్యూ)
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై `ఫలక్‌నుమాదాస్` వంటి సక్సెస్ఫుల్ మూవీతో హీరోగా తనకంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `హిట్`. `ది ఫస్ట్ కేస్` ట్యాగ్ లైన్. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28న విడుదలవుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ట్రైలర్ వ్యవథి 2 నిమిషాల 7 సెకన్లు ఉంది.
ఓ హై వేపై కారు నుండి ఓ అమ్మాయి దిగి ఎవరి కోసమో వెయిట్ చేస్తుంటుంది. ఆ దారిలో వెళుతున్న పోలీస్ ఆఫీసర్ మురళీశర్మ గురించి తెలుసుకుని క్షేమంగా ఇంటికెళ్లగలవా అని అడిగి తెలుసుకోవడంతో టీజర్ మొలవుతుంది. ఓ భార్య, భర్త పోలీస్ స్టేషన్‌కి వచ్చి మా అమ్మాయి కనపడటం లేదు సార్ అని కంప్లైట్ ఇస్తారు.
విక్రమ్ రుద్రరాజు అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో విశ్వక్సేన్ కనపడతారు. ప్రీతి అనే అమ్మాయి కనపడకుండా పోతే..ఆమె గురించి విక్రమ్ వెతుకుతుంటాడు.
`నీ చుట్టు పక్కల జరిగే చిన్న చిన్న విషయాలు నీకు నీ గతాన్ని గుర్తు చేస్తున్నాయిని.. అందుకే భయంతో ఎటాక్‌కి గురవుతున్నావని విశ్వక్సేన్తో ఓ అమ్మాయి అంటుంది.
ఒక్కసారి నా గురించి ఆలోచించు .. ఐ డోంట్ వాంట్ లూజ్ యు అని హీరోయిన్ రుహానీ శర్మ హీరోయిన్‌తో చెబుతుంది.
విశ్వక్ ప్రీతి ఎక్కడకు వెళ్లింది అని ఆరా తీసే సన్నివేశాలు కొన్నింటిని ట్రైలర్లో చూపించారు.
ప్రెస్ ఇన్వాల్వ్ అయ్యింది..హ్యండిల్ ఇట్ వెరి కేర్ఫుల్లీ అనే విశ్వక్సేన్ పై అధికారి భానుచందర్ అతనికి చెబుతాడు.
తర్వాత మరికొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలను చూపించారు. ట్రైలర్ చివర్లో విశ్వక్‌ని ఓ అమ్మాయి హు ఆర్ యు విక్రమ్ అని ప్రశ్నిస్తుంది.
ట్రైలర్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం, మణికందన్ సినిమాటోగ్రఫీ సినిమా సన్నివేశాలను నెక్ట్స్ లెవల్లో ఎలివేట్ చేస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments